ఆ మద్య హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు సంబవించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కొంత మంది మృత్యువాత పడ్డారు, చాలా మంది గాయపడ్డారు. ఈ బాంబు పెలుళ్లకు ప్రధాన సూత్రదారి యాసిన్ భత్కల్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈయనపై దేశ వ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులు ఉన్నాయి. అయితే ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది.

దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లస్ట్ లో రక్త సిక్తమైన దృశ్యం


ఈ విషయం స్వయంగా భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. చర్లపల్లి జైల్లో ని ఫోన్ తో ఢిల్లీ లో ఉన్న తన భార్య జహిదా కు దాదాపు పదిసార్లు ఫోన్ చేసినట్లు అయితే సిరియాలోని ఐఎస్ మిత్రులు జైలు నుంచి బయటపడేందకు సహకరిస్తున్నారని పేర్కొన్నాడు.  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరియా రాజధాని డమాస్కస్ కు వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది.

చర్లపల్లి జైలు, యాసిన్ భత్కల్


ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జైల్లోని ఖైదీలు మాట్లాడే మాటలను తాము వినకపోయినా, వాటిని రికార్డు చేస్తామని, అడిగితే ఈ వివరాలు విచారణ సంస్థలకు అందిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: