మీడియాను ఆకర్షించేలా ప్రసంగించడంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దిట్ట. ఏ మాట మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది.. ఏ మాట మాట్లాడితే మీడియాలో పబ్లిసిటీ వస్తుందో ఆయనకు బాగా తెలుసు. కేవలం పబ్లిసిటీ కోసమే కాకపోయినా.. తన స్వతహాగా స్వేచ్ఛగా మాట్లాడే వైఖరితో ఆయన ఆటోమేటిగ్గా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతారు. 

జేసీ రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ వదులుతున్నారు. చంద్రబాబు అనంతపురం పర్యటనలో పాల్గొన్న జేసీ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు పట్టిసీమ నీళ్లు రప్పిస్తుంటే..జగన్ అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే ఆయన పట్టిసీమో.. యా సీమో.. నీయబ్బ జగన్.. యా సీమ అయితే ఏమిరా.. నీళ్లొచ్చేదానికి.. అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. 

జేసీ.. ఆయన మాటతీరే అంత..


పనిలో పనిగా జేసీ చంద్రబాబుకు కూడా చురకలు వేస్తున్నారు. చంద్రబాబు పట్టిసీమ నీళ్లు రాయలసీమకు రప్పిస్తానన్నారని.. కొన్నాళ్లు వేచి చూసి ఆ పని కాకపోతే.. అప్పుడు జగన్ తో చేతులు కలిపి బాబుపని పడతామని వ్యంగ్యంగా అన్నారు. ఊరికే తిడితే ఏంబావుంటుందనుకున్నారో ఏమో.. చంద్రబాబులో మహాత్ముడు కనిపిస్తున్నాడని మళ్లీ భజన అందుకున్నారు. 

తాను ప్రతిపక్షంలో ఉండగా కూడా చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడనే అనేవాడిని అంటూ తన కామెంట్స్ కు భాష్యం చెప్పుకున్నారు జేసీ. గతంలో ప్రాజెక్టుల విషయంలో ఎన్టీఆర్ వైఖరిని తప్పు పట్టేవారిమని.. కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని జేసీ అనడం విశేషం. తమ లాగానే జగన్  కూడా చంద్రబాబు విషయంలో తప్పుతెలుసుకుని విమర్శలు మానుకోవాలని జేసీ ఆకాంక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: