ప్రజాస్వామ్యంలో కులాల ప్రస్తావన పరిమితమే అయినా.. వాటి ప్రాధాన్యత మాత్రం విస్మరించలేం. తెలుగు రాష్ట్ర్రాల్లో కమ్మె,రెడ్డి, వెలమ కులాల ఆధిపత్యపోరు అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు కమ్మ కులాన్ని మూఢత్వంవైపు నడిపిస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఓ పత్రికలో వ్యాసం వెలువడటం విశేషం. 

ఆ వ్యాసం రాసింది ప్రముఖ సామాజిక రచయిత కంచె ఐలయ్య. ఈయన నేనెట్ల హిందువునైత.. అనే పుస్తకంతో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కమ్మ కులానికి ఘనమైన వారసత్వం ఉందని.. దాన్ని బాబు చెడగొడుతున్నారన్నది ఈయన వాదన. కమ్మకులస్తులైన త్రిపురనేని వంటి మహానుభావులు హేతువాదాన్నిబలంగా వినిపించారని.. కానీ చంద్రబాబు రోజురోజుకూ మూఢవిశ్వాసాలవైపు అడుగులేస్తున్నారని కంచె ఐలయ్య విమర్శించారు. 

మూఢ విశ్వాసాలపై కంచె ఐలయ్య వ్యంగ్యాస్త్రాలు..


అందుకు ఉదాహరణగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని భూమి పూజ పేరును పేర్కొన్నారు. రాష్ట్రమంతటికీ చెందిన ఈ కార్యక్రమాన్ని జుగుప్సాకరమైన కుటుంబ వ్యవహారంగా చంద్రబాబు మార్చారని ఐలయ్య విమర్శించారు. ఇదే రాష్ట్రంలో నాగార్జున సాగర్‌ను నెహ్రూ ప్రారంభించినప్పుడు.. కనీసం కొబ్బరికాయ కూడా కొట్టని విషయాన్ని ఐలయ్య ప్రస్తావించారు. ఆధునిక దేవాలయంలో మూఢవిశ్వాసాలకు తావులేదని ఆనాడే నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. 

నేటి పాలకు మాత్రం ఏమాత్రం చరిత్ర జ్ఞానం కూడా లేకుండా... హేతుబద్ధమైన బుద్ధిస్టు విహారకేంద్రంగా ఉన్న అమరావతిలో పంచె కట్టుకొని యజ్ఞయాగాదులు చెయ్యడం ఆశ్చర్యకరమని ఐలయ్య రాశారు. త్రిపురనేని వారసత్వం ఉన్న కమ్మ కులాన్ని చంద్రబాబు మెడలో నిమ్మకాయలేసుకొని, చేతిలో రుద్రాక్ష మాలలు పట్టుకొని తిరిగే వాళ్ళుగా తయారుచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: