ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలుగు దేశం పార్టీ తరుపున చంద్రబాబుకు నమ్మిన బంటులా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఆ వేంటనే తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా మంత్రి పదవే కొట్టేశారు. ఇప్పుడు ఈయన టీడీపీ పలు ఆరోపణలు చేస్తుంది ముఖ్యంత టీడీపీ తరుపున నెగ్గిన తలసాని ఆ పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో పదవి అనుభవిస్తున్నారని ఇది ఎంతవరకున్యాయం అని అంటున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్‌పై తెలుగు దేశం ఎమ్మెల్యేల బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ


తెలుగుదేశం పార్టీ జెండాతో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధమని వారు ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్ యాదవ్ ను గురించి విచారించారు. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మంత్రివర్గంలో ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్‌ టీడీపీ ఎమ్మెల్యేనా!? టీడీపీ తరఫున గెలిచిన ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా పని చేస్తున్నారు!? అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరా తీశారు.


రాష్ట్రపతిని కలిసిన టీటీడీపీ నేతలు


కాంగ్రెస్‌, టీడీపీల నుంచి ఎంతమంది పార్టీ ఫిరాయించారు? అధికార టీఆర్‌ఎస్‌లో ఎంతమంది చేరారు? అని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు కూడా జారీచేసిందని, అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరడంద్వారా వాటికి సమాధానాలు చెప్పకుండా స్పీకర్‌ దాటవేస్తున్నారని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. దాంతో ఫిరాయింపులపై మీ వినతి పత్రాన్ని కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి తగు చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని టీడీపీ బృందానికి రాష్ట్రపతి హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: