ఈ మద్య తెలంగాణలో రాజకీయాల్లో పెను మార్పులు సంబవిస్తునన్నాయి.. ఏ పార్టీవాళ్లు ఏ పార్టీలో చేరుతున్నారో చెప్పడం కష్టమైపోయింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీ.ఎస్. ఆ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ లో పనిచేయడానికి సిద్దమైనట్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నాట్లు తెలిపారు. ఆయతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వలస బాట పడుతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దానం ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. పైగా, తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


డి.శ్రీనివాస్


పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్‌కు దానం నాగేందర్ ప్రధాన అనుచరుడు.డీఎస్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా దానం నాగేందర్ జీహెచ్ఎంసీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సైతం వదులుకున్నారు.  మరి అలాంటపుడు డీఎస్ టీఆర్ఎస్ లోకి జంప్ అయితే ఆయన బాటలోనే దానం పయనిస్తాడు కదా అన్ని అనుమానాలు చాలా మందికి కలిగాయాయి ..!వీటన్నిటికి సమాదానం ఇస్తూ ఆ వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని దానం కొట్టిపారేశారు. పార్టీ మారట్లేదని విస్పష్టంగా ప్రకటించినా, ఇవేం ప్రశ్నలంటూ ఆయన మీడియా ప్రతినిధులపై ఒకింత అసహనం వ్యక్తంచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: