ఓటుకు నోటు వ్యవహరం ఇప్పటి వరకు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిందనుకుంటే  ఇప్పుడు అధికారులపై ఆ ప్రభావం పడింది. తాజాగా ఆంద్రప్రదేశ్ ఇంటిలెజెన్స్ అధికారి అనూరాధను ప్రభుత్వం బదిలీ చేసింది. ఓటుకు నోటు కేసు లో ఇరుకున పడిన నేపధ్యంలో ఆమె ముందస్తుగా సమాచారం తెలుసుకోలేకపోయారన్న అసంతృప్తి ఏపీ ప్రభుత్వంలో ఉంది.  ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు ఆమెపై బదిలీ వేటు వేయాలనుకున్నా కొంత సమయం తీసుకుంటూ వచ్చారు.

నోటుకు ఓటు సంక్షోభం


ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి అనురాధను తప్పించారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయవాడ కమిషనర్ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతం సవాంగ్‌ను నియమించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డీజీగా అనురాధను నియమించారు.ప్రస్తుతం పోన్ టాపింగ్ అంశాన్ని వాడుకుని కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ బాద్యతను వెంకటేశ్వరరావుపై పెట్టిందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: