అవును మీరు వింటుంది నిజమే.. మన దేశంలో అందునా మన తెలంగాణ రాష్ట్రంలో రామోజీ ఫిలిం సిటీ అంటే  తెలియని వారు ఉండరు.. ఇప్పుడు ఈనాడు గ్రూప్ సంస్థల అదినేత రామోజీరావు ప్రపంచంలోనే అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. రామోజీరావు తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఒక  ఆద్యాత్మిక నగరం నిర్మించ తలపెట్టారు అదే ఓం నగరం ఇక్కడ మొత్తం దేవతా మూర్తులతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్తిగా ఆద్యాత్మిక చింతన కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు నిర్మించ బోతున్నారట.

రాష్ట్రపతిని కలిసిన రామోజీరావు కుటుంబ సభ్యులు


దీనికోసం రామోజీరావు,తన కుటుంబ సభ్యులు కుమారుడు కిరణ్, పెద్ద కోడలు శైలజా కిరణ్ ,చిన్న కోడలు విజయ తదితరులతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తాను నిర్మించ తలపెట్టిన ఓం సిటీ నగర విజన్ పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తామని కూడా రామోజీ వెల్లడించారు. ఈ సందర్భంగా  ప్రణబ్ ముఖర్జీ ఓం నగరం ఎప్పటికి పూర్తి అవుతుందని రామోజీని అడిగినట్లు సమాచారం.   కాగా రాష్ట్రపతికి ఆంజనేయస్వామి విగ్రహ నమూనా చిత్రాన్ని రామోజీ అందచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: