ఓటుకు నోటు కేసులో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఎసిబి అరెస్టు చేసింది.  తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు టీడీపీ ఎమ్మెల్యెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఆ మద్య ఏసీబీ సండ్రకు నోటీసులు పంపిస్తే తన ఆరోగ్యం బాగా లేదని చెప్పి తప్పించుకున్నారు.  ఈ కేసులో నిందితుడు అయిన మత్తయ్యతో వీరయ్య మాట్లాడారని, అలాగే రేవంత్ తో ఎక్కువ సార్లు టచ్ లో ఉన్నారని కాల్ డేటా ఆధారంగా నిర్దారించారు. గతంలో సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది కానీ దానికి సక్రమంగా స్పందించక పోవడంతో  శనివారం మళ్లీ నోటీసులు జారీ చేశారు..  తను ఖమ్మంలోనే ఉన్నానని ఏసీబీ అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని  తెలిపారు సండ్ర వెంకట వీరయ్య.  ఓటుకు నోటు కేసులో వ్యవహారంలో  చాలా మంది ఎమ్మెల్యేలతో సండ్ర మద్య వర్తిత్వం నడిపారని ఆరోపణ.  


తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వివాదం


చాలా మంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడాని ప్రయత్నించినట్లు అభియోగం. అయితే స్టిఫెన్ సన్, సెబాస్టియన్ లతో నిత్యం టచ్ లో ఉన్న సండ్ర.  ఉదయం నుంచి సండ్రను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు.  ఏడు గంటల విచారణ అనంతరం అరెస్టు చేసిన ఏసీబీ అధికారు. కాగా తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారని తెలుగు దేశం నాయకులు, కార్యకర్తల అంటున్నారు. కాగా ఈ కేసులో మరో వ్యక్తి అయిన తెలుగుయువత నాయకుడు జిమ్మి మాత్రం విచారణకు హాజరు కాలేదు.రేవంత్ రెడ్డి అరె్స్టు తర్వాత ఇది రెండో అరెస్టు అవుతుంది. కాగా అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డిని విచారించినా, అరెస్టు చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: