ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న సండ్రకు గతంలో ఏసీబీ నోటీసులు పంపించినా వాటికి స్పందన రాకపోవడంతో మళ్లీ నోటీసులు పంపించారు. దీంతో సోమవారం ఉదయం ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. ఏడుగంటల విచారణ అనంతరం సండ్రను అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులోనిందితుడైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యను తెలంగాణ ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం కోర్టుకు తరలించారు.  కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనడంతో వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తీసుకు వెళ్లారు...ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

సోమవారం ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు మీడియాతో మాట్లాతున్న సండ్ర


 కేసు విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును ఏసీబీ కోరనుంది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఏసీబీ నిన్న సండ్రను తమ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎసిబి అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనకు తెలియదంటూ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెబాస్టియన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు కాబట్టి ఆయనతో మాత్రమే తాను మాట్లాడినట్లు సండ్ర చెప్పారని అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: