బాహుబలి సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. టికెట్ల కోసం వేట మొదలైంది. ఇప్పటివరకూ సినీజనం, అభిమానులు మాత్రమే బాహుబలిపై కామెంట్లు చేయగా.. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా బాహుబలి గురించి కామెంట్ చేస్తున్నాయి. లేటెస్టుగా.. సీపీఎం నేత సుధాకర్ స్పందిస్తూ.. బాహుబలి సినిమా కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. 

హాట్ కేకుల్లా బాహుబలి టిక్కెట్లు.. 

Image result for rana bahubali new photos
లాభాల కోసం ప్రజలను బాహుబలి నిర్మాతలు మభ్యపెడుతున్నారని సుధాకర్ విమర్శలు చేశారు. టికెట్లు అయిపోయాయంటూ సినిమా ధియేటర్ల యాజమాన్యాలు కూడా అనవసర హడావుడి చేస్తున్నాయని అన్నారు. బాహుబలి పేరుతో సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేప్రమాదం ఉందని.. అలా జరగకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. మరోవైపు.. బాహుబలి సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు ధియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ఆరంభం అయిన కొద్ది సేపటిలోనే తోలి రోజు టికెట్స్ అమ్ముడయ్యాయి. మరో రెండు మూడు

రోజులవరకూ ఇదే పరిస్థితి. అయితే మొదటి రోజే తమ అభిమాన నటుడి సినిమా చూడాలని ఆశపడుతున్న ప్రభాస్, రానా ఫ్యాన్స్ మాత్రం నిరాశకుగురవుతున్నారట. కరీంనగర్ వంటి చోట్ల ప్రభాస్, రానా అభిమానులు ధర్నాలు కూడా చేస్తున్నారు. అక్కడి ప్రతిమ మల్టిఫ్లేక్స్ దగ్గర రానా అభిమానుల సంఘం నాయకుడు కిరుపాల్ సింగ్ ఆధ్వర్యంలో కొంతమంది అభిమానులు ధర్నా చేశారు. థియేటర్ యాజమాన్యం రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పి పరిస్థితులని చక్కదిద్దారు.



మరింత సమాచారం తెలుసుకోండి: