అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించని పాఠశాలలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని శనివారం సచివాలయంలో ఆయన నిర్వహించారు. హోమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు, పురపాలక, విద్య, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి సమావేశ వివరాలను పత్రికల వారికి తెలిపారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా స్షందించాలనే విషయం పై విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు విడతల వారిగా అవగాహన కల్పిస్తామన్నారు. సచివాలయంలో మాక్ డ్రిల్ ను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులకు సంబంధించి 8 వేల మంది విద్యార్థలపై 1660 కేసులు ఉన్నాయన్నారు.  అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా 984 మందిపై కేసులను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మరో 400లకు పైగా కేసులు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే ఇవి కూడా పరిష్కారం అవుతాయన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: