ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి.. ఈ ప్రశ్నకు ఇప్పుడు వచ్చే సమాధానం అమరావతి అనే. కానీ ఈ పేరు త్వరలో మారబోతోందట. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో తెలియదు కానీ అమరావతి పేరుకు తోడుగా విజయవాడ కూడా చేరబోతోందట. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనం కలకలం సృష్టిస్తోంది. 

అమరావతి పేరును అమరావతి - విజయవాడగా మార్చబోతున్నారన్నది ఆ కథనం సమాచారం. జంట నగరాల అభివృద్ధి కోసమే ఈ మార్పు చేస్తున్నట్టు సమర్థించుకోవాలన్న ఆలోచనలో ఉందట. పైకి అభివృద్ధి పేరు చెబుతున్నా ఈ మార్పు ఆలోచనకు అసలు కారణం మాత్రం జ్యోతిష్యమేనంట. 

అమరావతి ఇకపై అమరావతి-విజయవాడ..


అమరావతి పేరుతో ప్రాధాన్యం ఇచ్చి.. విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మకు ప్రాధాన్యత తగ్గించడం వల్లే ఈ మధ్య వరుసగా దుర్ఘటనలు జరిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని భావిస్తున్నారట. అసలే ఈ మధ్య జ్యోతిష్యుల మాట బాగా వింటున్న చంద్రబాబు ఈ మార్పుకు అంగీకరం చెబుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పేరును అమరావతి- విజయవాడ గా మారిస్తే.. దోషం తగ్గుతుందని భావిస్తున్నారు. 

ఐతే.. ఏపీ రాజధానికి ఏ పేరు పెట్టుకోవాలా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు.. చంద్రబాబు రాజగురుగా పేరున్న రామోజీ అమరావతి పేరును సూచించారు. అమరావతి పేరు ఎందుకు సహేతుకమైందో వివరిస్తూ తన పత్రిక ఈనాడులో వ్యాసం రాశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా అమరావతి పేరునే ఖరారు చేశారు. మరి ఇప్పుడు ఈ మార్పు రామోజీకి కోపం తెప్పిస్తుందా.. లేదా ఈ మార్పుకు ముందే అనుమతి తీసేసుకున్నారా.. లోగుట్టు టీడీపీ వర్గాలకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: