నిన్న మరణించిన మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం భౌతిక కాయం ఢిల్లీ చేరుకుంది. ప్రత్యేక విమానంలో ఇక్కడ వచ్చిన పార్ధీవ దేహానికి సైనికాధికారులు ప్రభుత్వ లాంఛనాలతో కిందకు తీసుకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు.కలాం పార్ధీవ దేహాం పాలెం విమానాశ్రయానికి చేరుకోగానే  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని మోడి,ఉప రాష్ట్రపతి రక్షణ మంత్రి పారికర్‌,త్రివిధ దళాధిపతులు అక్కడకి చేరుకుని కలాం పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.  

తొలుత ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. ఆ తర్వాత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.తదుపరి రాష్ట్రపతి ప్రణబ్ వచ్చి నివాళి అర్పించిన తర్వాత సైనిక వందనం గీతాలాపన జరిగాయి. గీతాలాపన సమయంలో సైనికాధికారులు, రాష్ట్రపతి సాల్యూట్ చేశారు.ఆ తర్వాత రాష్ట్రపతి మరికొంతసేపు మౌనంగా నిలుచుని శ్రద్దాంజలి ఘటించారు.ఆ తర్వాత మిలటరీ బాండ్ వారు మరో గీతాన్ని ఆలాపించి శ్రద్దాంజలి ఘటించారు.  కేంద్రమంత్రి వర్గం సమావేశం ముగిసింది.అబ్దుల్‌ కలాం మృతిపై కేంద్ర కేబినేట్‌ సంతాప తీర్మానం అమోదించింది.

కలాంకు నివాళలు అర్పిస్తున్న రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ


కలాం అంత్యక్రియలకు సంబంధించి నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినేట్‌ కుటుంబ సభ్యుల కోరిక మేరకు రామేశ్వరంలోనే అంత్యక్రియలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.  అబ్దుల్‌ కలాం భౌతిక కాయాన్ని టెన్‌ రాజాజీ మార్గ్‌ నివాసానికి తీసుకెళ్తారు. రేపు రామేశ్వరంలో డాక్టర్‌ అబ్దుల్‌ కలాం భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగతాయి.రామేశ్వరంలో జరిగే అబ్దుల్‌ కలాం అంతిమ యాత్రలో ప్రధానితో సహా కేంద్రమంత్రులు,పలువురు రాజకీయ ప్రముఖులు,కలాం కుటుంబ సభ్యులు,కలాం సన్నిహితులు పాల్గొంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: