ఓటుకు నోటు కేసు... రెండు నెలల క్రితం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కేసు.. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కూడా.. నిద్రపట్టడం లేదని కూడా అధికారులతో కామెంట్ చేశారు. మొదట్లో కాస్త షాక్ కు గురైన.. ఆ తర్వాత చంద్రబాబు ఈ విషయంలో చకచకా పావులు కదిపారు. ఎక్కన నొక్కితే పని జరుగుతుందో అక్కడ నొక్కారు. 

ఓటుకు నోటు కేసులో టీ సర్కారు చేసిన తప్పులను తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంటూ కొత్త వివాదాలు లేవనెత్తారు.. నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్ నిప్పులు చెరిగినా.. కనీసం నోటీసు కూడా ఇవ్వలేని పరిస్థితి కల్పించారు. స్వర పరీక్షకు పిలుస్తారని హడావిడి జరిగినా చివరకు చంద్రబాబు ఈ కేసు నుంచి సేఫ్ గానే బయటపడినట్టు చెప్పుకోవాలి. 

ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. 

Image result for revanth reddy caught videos
ఇప్పుడు ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబుకు ఫుల్ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో మంగళవారం మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు.. ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు. 39 మంది సాక్షుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు, ఫోన్ కాల్‌డేటా, ట్రాన్స్‌స్క్రిప్ట్, ఫోరెన్సిక్ రిపోర్టు వంటి వివరాలను 316 పేజీల్లో, మరో 25 పేజీల్లో దర్యాప్తు సమాచారంతో ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినా ఎక్కడా బాబు ప్రస్తావన మాత్రం లేదు. 

తెలంగాణ ఎమ్మెల్యే స్ఠీఫెన్ సన్ కు లంచం ఇస్తూ దొరికిపోయిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏ 1 నిందితుడిగా ఏసీబీ పేర్కొంది. రెండో నిందితునిగా సెబాస్టియన్, మూడో నిందితునిగా ఉదయసింహ, నాలుగో నిందితునిగా మత్తయ్య, ఐదో నిందితునిగా సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. వీరిలో మత్తయ్య మినహా మిగిలిన నలుగురు అరెస్టయ్యారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, ఇంకొంతమందిపై కేసులు నమోదయ్యే అవకాశముందని, దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ కోర్టుకు విన్నవించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: