జనం మనసు గెలుచుకున్న మాజీ రాష్ట్రపతి హఠాన్మరణం యావత్ భారత జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన క్షిపణి పితామహుడు.. గగనతలంలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన శాస్త్రవేత్తకు ఘననివాళి అర్పించింది. దేశాన్ని శోకసముద్రంలో ముంచి నింగికేగిన అసామాన్యుడికి ప్రముఖులంతా సంతాపం తెలిపారు.  

సోమవారం రాత్రి ఆయన మరణించగానే ప్రముఖుల నుంచి స్పందన మొదలైంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకుని గల్లీ నాయకులు కూడా వెంటనే స్పందించారు. మంగళవారమంతా ఆ సందేశాల వెల్లువ కొనసాగింది. ఐతే.. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎందుకనో చాలా ఆలస్యం చేశారు. కలాం మరణించిన తర్వాత చాలా ఆలస్యంగా అంటే దాదాపు 24గంటలు తర్వాత పవన్ స్పందించారు. 

పవన్..నీకిది తగునా..

Image result for pavan kalyan

అది కూడా మీడియాకు మెస్సేజ్ లు పెట్టడం ద్వారా మాత్రమే.. అబ్దుల్ కలాంనకు సెల్యూట్ అంటూ ఆయన మంగళవారం రాత్రి మీడియాకు మెస్సేజ్ లు వచ్చాయి. పవన్ కల్యాణ్ ప్రముఖ నటుడే కావచ్చు.. ఆయన చాలా బిజీగానే ఉండొచ్చు. కానీ ఓ ప్రెస్ నోటు కూడా పంపేంత తీరిక లేకుండా ఉంటారని అనుకోలేం. 

మహా మనిషీ కలాం మరణం కూడా కదిలించలేదనంత బిజీగా ఉంటారనీ అనుకోలేం. ఇలాంటి ఘటనలు పవన్ వంటి నటుడిపై యువతలో దురభిప్రాయం కలిగించే అవకాశం ఉంది. అసలు ఇంత ఆలస్యంగా స్పందించడం కంటే.. స్పందించకుండా ఉంటేనే బావుండేదేమో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: