కేసీఆర్ ఏం చేసినా కాస్త ఎక్కువగానే ఉంటుందని ఓ టాక్.. నోరు తెరిస్తే ఎక్కడ తమను బూతులు తిడతాడో అని ఆంధ్రా నాయకులు భయపడుతుంటారు. ముందూ వెనుకా చూడకుండా.. సభ్యత సంస్కారాలు పక్కనపెట్టి..  నోటికి ఎంత మాట వస్తే అంతమాట అంటారని కేసీఆర్ పై ఓ విమర్శ ఉంది. అది నూటికి నూరుపాళ్లూ సత్యం కూడా. 

ఐతే.. కేసీఆర్ లో దయాగూణం కూడా కాస్త ఎక్కువే. అందుకే అడిగినవారికల్లా వీలైనంతవరకూ ఓ కే చెప్పేస్తుంటారు. ఇప్పుడు సవతి తల్లి, తండ్రిల చేతిలో దారుణ హింసకు గురైన ప్రత్యూష విషయంలో ఆయన గతంలో ఏ సీఎం కూడా వ్యవహరించనంతగా స్పందించారు. గతంలోనే ఆమె వద్దకు స్వయంగా వెళ్లి పరామర్శించిన కేసీఆర్..ఇప్పుడు ఆమెను ఇంటికి పిలిపించుకుని ఆదరణ చూపారు. 

ప్రత్యూష క్షేమ సమాచారాలు కనుక్కున్న కేసీఆర్.. ఆమెతో కలసి భోంచేశారు. ప్రత్యూష అక్కౌంట్ లో తక్షణం లక్ష రూపాయలు వేయాలని, ఆమెను హాస్టల్ లో చేర్పించాలని, ఆమెకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆమె చదవుకు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎప్పుడైనా తన ఇంటికి రావచ్చని , తన ఫోన్ నెంబర్లు కూడా ఆమెకు ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యూష పట్ల చూపిన ప్రేమను హైకోర్టు కూడా అభినందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రత్యూషను పరామర్శించి, తాము ఆమె బాద్యతను తీసుకుంటామని ప్రకటించడాన్ని హైకోర్టు స్వాగతించింది. ముఖ్యమంత్రి చొరవ వల్ల ఇలాంటి బాధితులు ఎందరికో భరోసా ఇస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: