తెలుగు రాష్ట్రా విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ తీర్మాణం చేస్తే దానికి అప్పట్లో బీజేపీ కూడా ఓకే అంది.. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయం పై ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని అక్కడ తీవ్ర స్థాయిలో టీడీపీపై కేంద్రం పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం మొదలు పెట్టాయి. ఇక ప్రతి పక్ష హోదాలు ఉన్న వైఎస్ ఆర్ సీపి, కాంగ్రెస్ పార్టీలు ఏపీ ప్రత్యేక హోదాపై ధ్వజమెత్తారు. సినీ నటుడు శివాజీ అయితే నిరాహార దీక్ష చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇక్కడ ఎంపీలు ప్రతేక్య హోదా గురించి పార్లమెంట్ లో నోరు మెదపటం లేదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం కష్టమైనదని మరోసారి స్పష్టమైంది. ‘ఇక మీదట రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించటం సాధ్యం కాదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే విధానం అమలు కావటం లేదు’అని కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్ శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రకటించారు. ఎంపీలు భీంరావ్ పాటిల్, విష్ణుదయాల్ రాం అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే విధానం ఇప్పుడు అమలు కావటం లేదని స్పష్టం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదా, ప్రధాని నరేంద్ర మోడీ



 తెలుగుదేశం పార్టీ పార్లెమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం బిజెపికి ఇష్టం లేదని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం తప్పు పనిచేస్తోందని, ఈ విషయంలో టిడిపి, బిజెపిలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అసలు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎప్పుడున్నారని, మోడీది విజిటింగ్ వీసా అని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవ్ కళ్యాణ్ ముందండి నజిపిస్తే తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు. ప్రత్యేక హోదాపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఇంతకన్నా ఏం చేయాలి, బట్టలూడదీసుకుని తిరగమంటారా అని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద సహనం కోల్పోయి మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: