తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. 60 యేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రావడంతో ఇప్పుడు తెలంగాణ అభివృద్ది కి కంకణం కట్టుకున్నారు కేసీఆర్. కొత్త కొత్త పథకాలు తీసుకు  వస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇక విపక్షాలు మటుకు వారి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఉస్మానియా ఆసుపత్రి ప్రక్షాలనకు నడుం భిగించారు కేసీఆర్. ఎన్నో యేళ్ల క్రితం నిర్మించిన కట్టడం కావడం తో ఇక్కడి కట్టడాలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. అయితే ఇక్కడ కట్టడాన్ని పూర్తికా కూల్చేసి నూతనంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునికమైన ఆసుపత్రి నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దం అయ్యింది. అయితే ఉస్మానియాను తరలించడం అంత సులభతరం కాదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు  దీనిపై ఘాటుగానే స్పందిస్తున్నారు.  వారసత్వ సంపదగా ఉన్న భవనాలను కూల్చడంకన్నా వాటి పునరుద్దరణకు తగు చర్యలు చేపట్టాలని ఉస్మానియా ఆసుపత్రి తరలింపును కూల్చడం ఆపకుంటే తాను ఆమరణదీక్ష చేపడతానని హన్మంతరావు టీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి గత పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు హైదరాబాద్ లో ఉస్మానియా ఆసుపత్రిపై ఎన్నో రకాల కథనాలు వచ్చాయి. శిథిలావస్తలో ఉన్నాయని పాములు కూడా వచ్చాయని కథనాలు వచ్చాయి. కానీ ఏనాడు కూడా ఆసుపత్రి  పునరుద్దరణ గురించి కించిత్ కూడా ఆలోచించలేదు.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు

vh

ఆసుపత్రిలో ఎప్పుడు ఏది కూలి మీదపడుతుందో అని రోగులు, వైద్యులు, సిబ్బంది భయంభయంగా కాలం వెల్లదీశారు. మరి అప్పట్లో ఈ విషయంపై హనుమంతన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా స్మానియా ఆసుపత్రి తరలింపును కూల్చడం ఆపకుంటే దీక్షకు దిగుతానని గట్టిగానే పట్టుపట్టారు వి.హనుమంతరావు. 


మరింత సమాచారం తెలుసుకోండి: