ఇప్పుడు ఉగ్ర వాదులు ఏ స్థాయి వారిని కూడా వదలడం లేదు.. వీరి టార్గెట్ ఎవరైనా అయితే ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లక్ష్యంగా ఆదివారం నాడు అతను ప్రయాణిస్తున్న కారు పై దాడి జరిగింది.గత వారంలో లష్కర్-ఏ-జగ్వీ మిలిటెంట్ మాలిక్ ఇషాక్ ను పోలీసు అధికారులు అంతం చేశారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే దాడి చేసింది ఆ దేశ వైమానిక దళానికి చెందిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్. అతను తన కారుతో వేగంగా దూసుకువచ్చి, నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.నకిలీ నెంబర్ ప్లేట్ కలిగిన కారుతో వేగంగా దూసుకువచ్చిన రెహ్మాన్ తొలుత షరీఫ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేశాడు. ఆ తర్వాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో ఢీకొట్టాడు. ఈ వాహనాన్ని ఢీ కొట్టింది ఎవరో కాదు   ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్ కారు వేగంగా ఢీకొట్టాడు.

nawaz-sharif-third-time-prime-minister-of-pakistan
పాకిస్థాన్ పట్టణం ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి నవాజ్ షరీఫ్ కుటుంబంతోపాటు ఇస్లామాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రధానిపై షాక్ గురైయ్యారు. వెనువెంటనే అప్రమత్తమైన పోలీసులు రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.  మొత్తానికి ఈ  ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు దీంతో సెక్యూరిటీ ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: