క్రీడలు అంటే ఎవరికైనా ఇష్టమే.. అందులోనూ క్రికెట్, ఫుట్ బాల్ అంటే మరి పిచ్చి.  సాన్ నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో ఘోరం జరిగింది. క్రీడాకారులు రంగంలోకి దిగి మ్యాచ్ ఆడుతున్న సమయంలో హటాత్తుగా రెండు గ్రూపులు  కాల్పులు జరుపుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో కొందరికి తీవ్రగాయాలు కాగా మైదానంలో ఆడుతున్న ఐదుగురు అక్కడే మరణించారు. 


వివరాల్లోకి వెళితే..  సాన్ నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో ఓ ఫుట్ బాల్ స్టేడియం ఉంది.  అక్కడ ఫుట్  బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో హటాత్తుగా  కొదందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన వాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

స్టేడియం వద్ద గట్ట బందోబస్తు


అయితే ఈ కాల్పులకు తెగబడ్డ వారు క్రీడను తిలకించడానికి రాలేదని.. వారి మద్య భూ వివాదాలు ఉన్నాయని అదును చూసి క్రీడా మైదానంలో కాల్పులు జరిపారని పోలీసు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే  భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు. కాల్పులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. కాగా అభిమానులు  క్రీడాకారులకు శ్రద్దాంజలి ఘటించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: