దేశంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం యువతను పెడ ద్రోవ పట్టిస్తున్నా అశ్లీల సైట్లపై కొరడా ఝులిపించింది. అయితే దేశంలో పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటివరకు కేంద్రం 857 అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. ఈ నిషేధంపై అనేక మంది నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన చర్యను ఉపసంహరించుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో టెలికాం శాఖ సంప్రదింపులు జరుపుతోంది. శ్లీల వెబ్‌సైట్లపై నిషేధాన్ని పలువురు ఇంటర్నెట్‌పై సెన్సార్‌గా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. దీంతో టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై సమీక్షించారు. ఆ తరువాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, అశ్లీలత లేని వెబ్‌సైట్లను అడ్డుకోరాదని ఐఎస్పీలకు సూచించామని చెప్పారు.

ఫోర్న్ వెబ్ సైట్స్


ముఖ్యంగా అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది ప్రముఖులు, సుప్రసిద్ధ రచయితలు, నెటిజన్లు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు.  చిన్ని పిల్లలపై  అశ్లీలతను చూపించే వెబ్‌సైట్లను తప్ప ఇతరమైన వాటిని ఇంటర్నెట్‌లో ఉంచే స్వేచ్ఛను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ)లకు కల్పిస్తున్నాం అని తెలిపింది. అశ్లీల వెబ్ సైట్లపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: