నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో ఎవరి వద్దనైనా సమాచారం లేదా ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని రిషికేశ్వరి మృతిపై విచారణ జరుపుతున్న కమిటీ సభ్యులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం బుధవారం తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషికేశ్వరి హత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక సీనియర్, నలుగురు జూనియర్ విద్యార్థులను డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు నిర్విరామంగా ఆయన ప్రశ్నిల వర్షం కురిపించారు. రిషితేశ్వరి డైరీలో పేర్లను చెరిపేసింది ఎవరు? వాటిపై‘మిస్టర్ ఎక్స్’అని రాసిందేవరు ? ఆమె ఆత్మహత్య చేసుకున్న జూలై 14 రాత్రి ఏం జరిగింది? వంటి ప్రశ్నలను ఆయన అడుడుగతున్నారిని సమాచారం తెలుస్తోంది.

ఆ రోజు రాత్రి రిషికేశ్వరి రాత్రి పదకొండు గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చిందని, హాస్టల్లో ఆహారం లేకపోవడంతో ఆమె బంధువు ఫుట్ పార్సిల్ తెచ్చి సెక్యూరిటీ చేతికి ఇచ్చిందని విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఆమె భోజనం పార్సిల్ తీసుకుని తన గదికి వెళ్లే సమయంలోనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ రోజు ఉదయం నుంచి హాస్టల్లో ఏం జరిగిందన్నది విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు.ఈ సంఘటన వెనుక కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు హస్తం పైనా పోలీసులు విచారిస్తున్నారు.

రిషికేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మంత్రి గంటా


ఆమె మృతదేహాన్ని చూసిన విద్యార్థినులు తొలుత బాబూరావుకు సమాచారం ఇవ్వగా, పోలీసులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎందుకు తరలించారన్న విషయమై ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సంఘటనై విద్యార్థి లోకం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ విషయంలో మంత్రి గంటా శ్రీనివాస్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివరాలు అడిగి తెలుసుకొని వెంటనే భాద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: