పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య దోస్తీ గత ఎన్నికల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్, బాబు, మోడీ త్రయం.. ఆంధ్రా ఎన్నికలను శాసించింది. సొంత పార్టీ ఉన్నా.. మోడీ విజ్ఞప్తి మేరకు చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్.. బీజేపీ- టీడీపీ దోస్తీకి బాసటగా నిలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీని ప్రజారాజ్యం ఓడిస్తే.. 2014లో చంద్రబాబును పవన్ గెలిపించాడని అంటుంటారు. అన్న పడగొడితే.. తమ్ముడు నిలబెట్టాడన్నమాట. 

చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యాక కూడా పవన్ కు మంచి వెయిటేజీ ఇచ్చారు. కానీ ఈ ఫ్రెండ్షిప్ క్రమంగా వీకవుతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని భూసేకరణ అంశం వీరిద్దరి దోస్తీకి ఇబ్బందికర అంశంగా తయారైంది. రాజధాని ప్రాంతంలోని భూములను రైతులకు ఇష్టంలేకుండా తీసుకోవద్దని పవన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు అండగా ఉంటానని శపథం కూడా చేశారు. 

కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికే 30 వేల ఎకరాలు సేకరించేశారు. ఐతే.. ఇప్పటివరకూ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇకపై భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించనున్నారు. దీనికి రంగం సిద్ధమైంది. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా.. రాజధాని భూములను ప్రభుత్వం గుంజేసుకుంటుందన్నమాట. అమల్లో ఉన్న చట్టం ప్రకారం పరిహారం ఇస్తారు. 

ఈ భూసేకరణ చట్ట ప్రయోగాన్ని పవన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన ఆ మధ్య ట్వీట్ ద్వారా స్పందించి.. బలవంతంగా తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నా... భూసేకరణ మాత్రం ఆగే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా చట్టం ప్రకారం భూ సేకరణ చేయవలసిందే అంటున్నారు. 

ఈ నేపథ్యంలో... పవన్ మరోసారి ట్వీట్ చేశారు. రాజధాని ప్రాంతంలో రెండు, మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకోవద్దని మళ్లీ కోరారు. మరి పవన్ ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారంటే .. సమరానికి సిద్ధమవుతున్నట్టే కదా... నా మాట దాని మీరు ఎలా ముందుకెల్తారో చూస్తా అని చెప్పినట్టే కదా.. మరి ఈ ఇష్యూ పవన్ వర్సెస్ చంద్రబాబుగా మారుతుందా.. రాజీ కుదురుతుందా.. వెయిట్ అండ్ సీ..


మరింత సమాచారం తెలుసుకోండి: