ఎవరైనా మనిషిని చూస్తే చాలా అందంగా ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనిషికి విలువ అందంతో కూడా ఉంటుంది. మనకు ఎంత అస్తులు, అంతస్తులు ఉన్నా అందవికారంగా ఉంటే లాభం ఉండదు. ముఖ్యంగా మహిళలు ఈ అందం కోసం తెగ తాపత్రయ పడుతుంటారు. ఎందుకంటే అందం వీరిక సొంతం అని భావిస్తారు. సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది.


సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది. 16 నుంచి 35 సంవత్సరాల వరకు ఆడవారు అందం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.


మరి ఈ అందాన్ని కాపాడే చిట్కాలు ఏమిటో చూద్దామా..!!

తేనే :  మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తేనే అందులో మొదటిది. చర్మానికి తేనే రాయటం వలన త్వరగా ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది 'యాంటీ-బ్యాక్టీరియా' గుణాలను కలిగి ఉండటం వలన. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది.


దోసకాయ :  ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో, దోసకాయ ఎలా మర్చిపోతున్నారు? ఫ్రిజ్ నుండి తీసిన దోసకాయల నుండి తయారు చేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్ళకు వాడటం వలన హైడ్రెటింగ్ భావనను పొందుతారు, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను కూడా త్రోలగిస్తుంది. మీరు నల్లటి మచ్చలను కలిగి ఉన్నారా.. అయితే తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి.


పాలు :  మీ చర్మం జిడ్డుగా ఉందా, అయితే చల్లటి మంచు గడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి; దీని వలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి, సౌందర్య చర్మం కోసం జీవన శైలిలో చాలా రకాల చిట్కాలను అనుసరించాలి.
దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది.


బాదం పప్పు పొడి, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా వస్తుది.
ముఖాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడే స్క్రబ్‌ తయారి : పెసరపండి, బియ్యప్పిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండి పట్టించి అందులో ఓట్‌మీల్‌ పౌడరు, నారింజతొక్కల పొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
క్యారెట్‌ రసంలో కొంత గోదుమ పిండి కలిపి ముఖానికి పూసుకుని 5 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం అందంగా, మృదువుగా తయారవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: