జయప్రద.. సత్యజిత్ రే వంటి దర్శకునితో సైతం అందగత్తెగా ప్రశంస పొందిన సుందరీ మణి. శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈ ముగ్గురూ అప్పట్లో తెలుగు తెరను ఓ ఊపు ఊపేశారు. వీరిలో శ్రీదేవి, జయప్రద హిందీలో కూడా తమ సత్తా చాటారు. 1976 చిత్రసీమకు పరిచయమైన ఈ అందాల రాశి..  మూడు దశాబ్దాలలో ఆరు భాషల్లో 300కు చిత్రాల్లో అలరించింది. సినిమాల్లో క్రేజ తగ్గాక.. జయప్రద సినీరంగంలో కూడా కాలుమోపింది.  

చంద్రబాబు హయాంలో పార్టీ మహిళా విభాగమునకు అధ్యక్షురాలుగా పనిచేసింది. రాజ్యసభకూ ఎన్నికైంది. ఆ తర్వాత బాబుతో పొసగక.. ఉత్తర భారతదేశ రాజకీయాల్లోకి వెళ్లింది. సమాజ్‌వాదీ పార్టీ లో చేరి.. ఏపీ నా జన్మ భూమి..  యూపీ నా కర్మభూమి అంటూ అక్కడివారిని ఆకర్షించింది. రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచింది. కానీ ఇప్పుడూ అక్కడ పరిస్థితులు అంతంతమాత్రమే.. మళ్లీ టీడీపీలో చేరే అవకాశం కూడా ఉందంటున్నారు. 

ఇలాంటి లేటు వయసులోనూ.. జయప్రద ఓ ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికవడం విశేషం. అదే అంబికా దర్భార్ బత్తి. ఈ మధ్య తరచూ ఆ యాడ్ లో కనిపిస్తోందామె. ఆ కంపెనీ 70 వ వసంతంలో అడుగుపెట్టి సందర్భంలో.. ఆమె జోరుగా ప్రచారం చేస్తోంది. జయప్రదతో ఓ డాక్యుమెంటరీ చేయించి దాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో అంబికా కుటుంబసభ్యులు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణను ఆకాశానికెత్తేసింది. మనం మహిళాశక్తి గురించి, సాధికారత గురించి ఎంతో మాట్లాడుకుంటాం కానీ..అంబికా కృష్ణ దాన్ని మాటల్లో చూపిస్తున్నారని పొగిడేశారు. తాను ఇటీవల ఆ కంపెనీని సందర్శించానని..అక్కడంతా మహిళే అన్ని పనులు చక్కబెడుతున్నారని.. ఇదెంతో గర్వకారణమని ప్రశంసించారు. అన్నట్టు అంబికా కృష్ణ కూడా గతంలో చాలా సినిమాలు నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: