తెలుగు సినీ చిత్ర సీమ‌లో త‌న‌కుంటూ ఓ చొటు ను సంపాందించుకున్న హీరో మెగా స్టార్, సుప్రీం హీరో, అన్న‌య్య అని పిలిపించుకునే న‌టుడు కొణిదేల శివ శంక‌ర వ‌రప్ర‌సాద్ అలియాస్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో ఆయ‌న‌కుంటూ ఎవ్వ‌రులేక‌పోయినా స్వ‌శ‌క్తి తో క‌ష్ట ప‌డి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయ‌న న‌టించిన పాత్ర‌లు, ఆయన తీసిన సీనిమాలు తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు, దేశంలోనే గొప్ప‌న‌టుడుగా పేరుంది. ఆయ‌న తెర‌పై క‌నిపించాడంటే థియేట‌ర్ లో అభిమానుల అనందం ఇంతా అంతాకాదు.  అయ‌న నృత్యం లో స్టెప్ లేస్తే అంతే.. అభిమానాలు కేరింత‌ల‌తో ఉబిత‌బ్బిబైయే వారే ఎక్కువ‌. సుమారుగా 21 సంవ‌త్స‌రాల సినీ జీవితంలో 149 సినీమాల‌లో న‌టించిన ఆయ‌న త‌న 150వ చిత్రానికి బ్రెక్ వేశారు. ఇక సినిమాలు చాలించుకుని తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే ఆయ‌న చేసిన పెద్ద త‌ప్ప‌ని ఇప్ప‌టికి ఆయ‌న అభిమానులు అంటున్నారు. 

మెగాస్టార్ చిర౦జీవి జీవిత౦ కొత్తగా టాలీవుడ్లో కి


మెగాస్టార్ చిర౦జీవి జీవిత౦ కొత్తగా టాలీవుడ్లో కి వచ్చే ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి, ఓ మామూలు కుర్రాడు కోట్లమ౦ది హృదయాల్లో గూడు కట్టుకుని మెగాస్టార్ గా ఎదిగిన తీరు అద్బుమనే చెప్పాలి. 1977 లో మొదలైన కెరీర్ 2008 వరకు నిరాటంకంగా సాగడ౦ అ౦దులోనూ ఎక్కువ శాత౦ టాలీవుడ్ నె౦వర్ వన్ హీరోగా తనే నిలవడ౦ అతిపెద్ద రికార్డు అని చెప్పడ౦లో ఎలా౦టి స౦దేహ౦ అవసర౦ లేదు. సినీ కెరీర్ ని, పెర్సనల్ వ్యవహారాలను పక్కన పెడితే చిరు కెరీర్ లో మాయని మచ్చగా నిలిచి౦ది ఏదైనా ఉ౦ది అ౦టే అది కచ్చి౦తగా రాజకీయాలే అని చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని "ప్రేమే మార్గ౦-సేవే ధ్యేయం" అ౦టూ చిరంజీవి 26 ఆగ‌ష్టు ,2008 లో ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. ప్ర‌జారాజ్యంలో ప్ర‌జ‌లే పాల‌కులు నేనే వార‌దిని అని చిరంజీవి ప్ర‌కించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం న‌డుస్తున్న వ్య‌వ‌హార శైలీ చిరంజీవి గ‌మ‌నించ‌లేక‌పోయారు. ఆయ‌న తిరుప‌తి నుంచి ప్ర‌జారాజ్యం పార్టీనుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఈ 7 ఏళ్ల రాజ‌కీయ జీవితం మాయ‌ని మ‌చ్చ‌గానే మిగిలాయి. 


పార్టీలో చేరిన నాయ‌కులంతా ఒక్క‌ప్పుడు రాజ‌కీయాల్లో చ‌రుకైన పాత్ర వ‌హించిన‌వారే. వారి స‌ల‌హాలు  పార్టీ బ‌ల‌ప‌లోపేతానికి ప‌నిచేయ‌లేదు. కేవ‌లం చిరంజీవికి జ‌నం లో ఉన్న క్రేజ్ ని క్యాచ్ చేసుకుని అధికారం లోని వెళ్లాల‌ని వ‌చ్చిన‌వారే ఎక్కువ‌గా ఉన్నారు. అంతేకాకుండా ప్ర‌జారాజ్యం పార్టీ చిరంజీవి బావ‌మ‌ర్దీ అల్లు అర‌వింద్ కూడా ఓ మైన‌స్ పాయింటేన‌ని ఇప్ప‌టికి కొంత మంది రాజ‌కీయ వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లను అల్లు అర‌వింద్ డ‌బ్బుల‌కు అమ్ముకున్నార‌ని రుమార్లు చెక్క‌ర్లు కొట్టాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియదు కానీ పార్టీ పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. అంతేకాకుండా ప్ర‌జారాజ్యం పార్టీ మెనిపేస్టో లు కూడా ఆశాజ‌న‌కంగా లేవ‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ మేదావులు విమ‌ర్శించారు. పార్టీ విధి విదానాల‌ను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెల్ల‌డంలో పార్టీ తీవ్రంగా విఫ‌లం చెందింది.

పార్టీ అదినేత అయిన చిర౦జీవికి పెద్దగా


పార్టీ అదినేత అయిన చిర౦జీవికి పెద్దగా అవగాహన లేని పని అవ్వడ౦తో అడుగడుగునా విమర్శలు విభేదాలు ఏర్పడట౦తో పార్టీ 2009 ఎన్నికల్లో ఘోర౦గా ఓడిపోయి౦ది. అంతేకాకుండా పార్టీలో ఉన్న తీవ్ర విభేదాల‌తో  చిరు త‌మ్ములైన నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు పార్టీకి దూర‌మైయ్యారు. 2009 ఎన్నిక‌లు వేడి అందుకునేందుకు వీరిద్ద‌రూ పార్టీ కోసం తీవ్రంగా కృషి చేశారు. ఫ‌లితాలు వెల్ల‌డైన అనంత‌రం పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో ఎన్నిక‌ల పై స‌మీక్షా నిర్వ‌హించిన స‌మావేశాలో వీరు ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. పార్టీ కార్యాల‌యానికి రావ‌టం కూడా మానేశారు. పార్టీ ఆవిర్భావానికి ముందు స‌న్నాహాక వ్య‌వ‌హారాల‌న్నీ నాగ‌బాబు చేతుల మీదుగా సాగాయి. ప్ర‌తి జిల్లాలోనూ ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టించారు. హైదారాబాద్ లో వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. అభిమాన సంఘాల కార్య‌క‌లాపాల‌ను చ‌క్క‌బెట్టారు.


ఇక పోతే యువ‌త‌ను కూడ గ‌ట్ట‌డంలోనే కాకుండా చిరంజీవికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్  కీల‌క పాత్ర పోషించారు. కీల‌క‌మైన యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. తాను ఎంపిక చేసిన కొంత మందిని పార్టీలోకి, యువ‌రాజ్యం లోకి తీసుకొచ్చారు. వారికి కీలక బాధ్య‌త‌లు అప్ప‌గించేలా చూశారు. తెలంగాణ ప్రాంతంలో అంతా తానై వ్య‌వ‌హ‌రించారు ప‌వ‌న్. అంతేకాకుండా సినీ రంగంలో ప్ర‌ముఖ హీరోలు, హీరోయిన్, కామెడియ‌న్స్, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సైతం కొంత‌కాలం పాటు షూటింగ్ ల‌క‌కు దూర‌మై పార్టీ గెలుపుకు అంకిత‌మ‌య్యారు. తొలుత పార్టీ ప‌రంగా కీలక నిర్ణ‌యాలు తీసుకునే కొర్ క‌మిటిగా స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించిన నాగుబాబు ప‌వ‌న్ లు, ఫ‌లితాలు ప్ర‌తికూలంగా రావ‌డంతో పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూర‌మ‌య్యారు. అంతేకాకుండా పార్టీలోని ప‌లు కీల‌క నేత‌లు సైతం పార్టీ దూర‌మౌతూ వ‌చ్చారు.  


ఇ౦తలో ప్రత్యేక తెల౦గాణ నినాదం, పార్టీలో చీరికలు ఇలా ఒకదానికొకటి ముడిపడి చిరుని కృ౦గ దీశాయి, దా౦తో చిరంజీవి ఆగ‌ష్టు  2011 లో  పార్టీని కా౦గ్రెస్ లో విలీనం చేశాడు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ అయ‌న‌ను గౌర‌వించి కేంద్ర స‌హాయ మంత్రి గా ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దా౦తో తన స్వార్ధం కోస౦ తనని నమ్మి వచ్చినవారిని అన్యాయ౦ చేశాడని పార్టీలో ఉన్నవారు తీవ్రంగా విమర్శి౦చారు. 2014 ఎన్నికల్లో కా౦గ్రెస్ కూడా ఓడిపోవడంతో ప్రస్తుత౦ రాజకీయాలకు కొద్దిగా దూర౦గా ఉ౦టున్నాడు చిర౦జీవి. కాని బయటి లోక౦లో మచ్చ అ౦టూ లేని చిర౦జీవికి రాజ‌కీయలతో వచ్చిన మాయని మచ్చకి నేటితో 7 ఏళ్ళు పూర్తి అయి౦ది.



మరింత సమాచారం తెలుసుకోండి: