సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. మరి వీటికి కల్లెం వేయాలంటే.. మహిళల్లోనూ చైతన్యం రావాలి. వాటితో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి తెచ్చుకోవాలి. ఆంధ్రా పోలీసులు అదే పని చేస్తున్నారు. మహిళలను రక్షించేందుకు సరికొత్త యాప్ సిద్దం చేశారు. 

ఆత్మరక్షణ కోసం కారప్పొడి, చాకు దగ్గర ఉంచుకోవడం పాతమాట.. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఆకతాయిల ఆటకట్టించొచ్చు.. ఆపద సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు. మహిళలు తమ స్మార్ట్ మొబైల్లో అభయ యాప్ లోడ్ చేసుకుంటే చాలు.. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మహిళలు అభయ్‌ ఆప్‌లో పానిక్‌ అనే కీ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం చేరిపోతుంది. ఆ కాల్ ఎక్కడ నుంచి పోలీసులకు తెలిసిపోతుంది. 

కనీసం ఫోన్ లో కీ నొక్కే అవకాశం లేనప్పుడు.. ఒక్కసారి గట్టిగా మొబైల్ ను ఊపినా చాలు.. ఆ మెసేజ్ పోలీసులకు వెళ్లిపోతుందట. అంతే.. పోలీసులు సకాలంలో చేరుకుని ఆమెను రక్షించే అవకాశం ఉంటుంది. ఇదే యాప్ ను కాలేజీల్లో బాగా ప్రచారం చేసి ర్యాంగింగును అరికడతారట. ఆంధ్రా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తమ సేవలు విస్తృతం చేసుకునేందుకు ఇలా విభిన్న మార్గాల్లో ముందుకెళ్తున్నారు. నేరుగా పోలీసు స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడిని వారి కోసం ఇప్పటికే ఐ క్లిక్‌ మెబైల్‌ ఆప్‌ను ప్రవేశపెట్టారు. 

క్షేత్రస్థాయిలో పని చేసే కానిస్టేబుళ్ల వద్ద నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు సాంకేతిక పరిజ్ఞానంపై చైతన్యవంతుల్ని చేసే ప్రక్రియను ఆంధ్రా పోలీసులు మొదలుపెట్టారు. అందుకే అధికారులందరికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఇలా మొదటి దశలో ఏడు వేలు ట్యాబ్‌ల ఇచ్చారు. ఈ ట్యాబ్ ల వల్ల.. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన వంటి పనులు మరింత సులువుగా పూర్తవుతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: