చంద్రబాబంటే ఎవరు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఇండియాలో ఓ పాపులర్ చీఫ్ మినిస్టర్.. డైనమిక్ లీడర్.. గుడ్ అడ్మినిస్ట్రేటర్.. ఇలాంటి పరిచయ వాక్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ చంద్రబాబులోని ఈ లక్షణాలకు ఏమాత్రం తక్కువ కాని లక్షణం ఇంకొకటి ఉంది. అదే ఆయనలోని పోలీస్ యాంగిల్.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. 

గురువారం మీడియాతో చాలాసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి అనేక విషయాలపై తన మనసులోని భావాలు వెలిబుచ్చారు. ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజెక్షన్ల ఆగంతకుడి విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతోపాటు గుంటూరులో ఎలుకలు కరచి పసికందు మరణంపైనా చర్చ జరిగింది. ఇంకా అనేక విషయాలపై చంద్రబాబు ఫ్రీగా మాట్లాడారు. 

పశ్చిమగోదావరి జిల్లా సైకో ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబులోని పోలీసు నిద్ర లేచాడు. ఇలాంటి కేసులను ఎలా డీల్ చేయాలో ఆయన సోదాహరణంగా వివరించారు. గతంలో ఆయన సొంతజిల్లాలోనూ ఇలాంటి మిస్టీరియస్ మర్డర్లు జరిగినప్పుడు చంద్రబాబు.. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. దర్యాప్తును దగ్గరుండి పరిశీలించారట. నిందితుడిని పట్టుకునేందుకు వేలి ముద్రలను సరిపోల్చాలని పోలీసులకు సూచించారట. అలా నేరస్తుడిని దొరకబుచ్చుకున్నారట. 

అంతే కాదు.. పశ్చిమగోదావరి జిల్లాలోని సైకో వీరంగం విషయంపై తాను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. ఈ ఘటనలో నష్టం చాలా తక్కువగా ఉన్నా.. అసలు అలాంటి ఘటన జరగనే కూడదన్నారు. ఈ సమస్య మూలాల్లోకి వెళ్లి.. తగిన విధంగా స్పందించాలని సూచించారు. మొత్తానికి  చంద్రబాబు పోలీసు ప్రొసీజర్ అంతా చెబుతూ తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: