ఉగ్రవాద పంజా భారత్ పై రోజు రోజుకు మరీ ఎక్కువై పోతుంది.. ముష్కరులు ఈ నెలలోనే మూడునాలుగు సార్లు తీవ్ర స్థాయిలో విచుకు పడ్డారు. ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి కేసులో పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ ను ఎన్ఐఏ అధికారులు సజీవంగా పట్టుకున్నారు ఇతనితో పాటు వచ్చిన మరో ఉగ్రవాది ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్ దాడుల‌కు పాల్ప‌డిన ఉగ్రవాది నవేద్ మెజిస్ట్రేట్ ఎదుట  నేరాన్ని అంగీకరించాడు తను పాకీస్తానినే అని ఆల్ ఖైదా తరుపున ఇక్కడ జవాన్లను హతమార్చడానికి వచ్చానని చెప్పాడు.


 ఉధంపూర్‌లో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ యాకుబ్ మరో వింత కోరిక బయటపెట్టాడు. భారత సైన్యానికి పట్టుబడ్డ నాడు 'హిందువులను చంపడం నాకో సరదా' అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్య పరిచాడట.


కసబ్ తర్వాత సజీవంగా పట్టుబడ్డ ఉగ్ర వాది   నవేద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ అలియాస్‌ ఖాసింఖాన్‌. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి మిలిటరీ. రషియాబాద్‌లో ఎదురు కాల్పుల్లో సజ్జాద్ అనే ఉగ్రవాదిని పట్టుకుని శ్రీనగర్‌కు తరలించారు.


పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది నవేద్

 

ఒక వైపు పాకిస్తాన్ చర్చలకు ఆహ్వనిస్తూనే మరో వైపు తన దుర్మార్గపు ఆలోచనలు అమలు పరుస్తుంది.  ఈ నెలలోనే   నవేద్‌తో పాటు తాజాగా సజ్జాద్ అనే రెండో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.22 ఏళ్ల సజ్జాద్ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు చెందిన వాడిగా గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: