ఆంధ్రా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు సలహాలు ఇచ్చేవారు ఎవరున్నారో గానీ.. ఏమాత్రం అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ జగన్ కు చెడ్డపేరు తెస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజాసమస్యలపై బంద్ లు, రాస్తారోకోలు చేయడం మామూలే.. కానీ ఈ ఆందోళనలకు ప్రజామద్దతు వచ్చేలా జాగ్రత్త పడటం చాలా అవసం కదా. అందులోనూ ఇప్పుడు ఏపీలో ప్రత్యేక హోదా హాట్ టాపిక్ అయ్యింది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అవసరం కదా..

ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసమయంలోనే ఏపీ బంద్ కు పిలుపు ఇవ్వాలని నిర్ణయించారు. మరి ఇలాంటి బంద్ ప్రకటన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. మొదట ఈనెల 28 న బంద్ కు పిలుపు ఇచ్చారు. కానీ ఆ రోజు వరలక్ష్మీ వ్రతం ఉంది కదా.. అని ఆ తర్వాత గుర్తొచ్చింది. మరి అలా గుర్తొచ్చినప్పుడైనా.. మరో రోజు వెదికేటప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి కదా.. 

కానీ జగన్ టీమ్.. మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. 28 నాటి బంద్ ను 29 కు మార్చారు. కానీ ఆరోజు రాఖీ ఉందన్న సంగతి మరచిపోయారు. ఇప్పుడు అదే విషయం ఆ పార్టీని విమర్శల పాలు చేస్తోంది. రాఖీ రోజు కాకపోతే మరో రోజు బంద్ పెట్టుకుంటే బావుండేది. అనుకున్నట్టే.. వైసీపీ బంద్ పై టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించారు.

వైసీపీ ఇచ్చిన బంద్.. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. జగన్ రక్షాబంధన్ రోజు బంద్ కు పిలుపునివ్వటాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ తండ్రి వై.ఎస్ కూడా హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ఏడుకొండల విషయంలో అందరి మనోభావాలు దెబ్బతినేలా వై.ఎస్. అసెంబ్లీలో ప్రవర్తిస్తే తామంతా అడ్డుకున్నామని గుర్తు చేశారు. మరి ఇలాంటి తప్పులు చేస్తే జగన్ ఎలా సీఎం అవుతాడో అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు



మరింత సమాచారం తెలుసుకోండి: