తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న ప‌రిపాల‌న‌లో కొత్త రూటు ఎంచుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకు గానూ సీఎం కేసీఆర్ వివిధ అంశాల‌కు సంబంధించిన వాటి విధానంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా న‌గ‌రంలోని భ‌వ‌నాల అక్ర‌మ నిర్మాణాల‌పై తీసుకున్న నిర్ణ‌య‌మే దీనికి నిద‌ర్శ‌నం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని ఆక్ర‌మ నిర్మాణాల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం కేసీఆర్ దాని పై తుది చ‌ర్య‌లు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ విముఖ‌త చూపారు. అంతేకాకుండా దీనిపై ఆధ్య‌య‌నం చేయాల‌ని న‌గ‌ర మంత్రుల‌తో పాటు ఆధికారుల‌కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఓ క‌మిటిని వేశారు. వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్య‌క్షుడిగా నియ‌మించారు.  సీఎం కేసీఆర్ ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టినాటి నుంచి తాను అనుకున్న‌ది చేసేందుకు సిద్ద‌మ‌య్యేవారు. అందుకు అనుగుణంగా ఎవ్వ‌రిని సంప్ర‌దించ‌కుండా నిర్ణ‌యాలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు త‌న స్వ‌త‌హాగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలేదు. ఇందులో ఏ ఆంశం త‌న‌కు క‌లిసి రాలేదని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.


సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రంలోఅభివృద్దికి


సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రంలోఅభివృద్దికి వివిధ నిర్ణ‌యాలు తీసుకున్నారు. కానీ ఇందులో  దాదాపు అన్ని అనుకూలించ‌లేదు. ప్ర‌ధానంగా స‌చివాల‌య త‌ర‌లింపు, ఉస్మానియా యూనివ‌ర్శిటి భూములు స్వాదీనం , అంతేకాకుండా ఉస్మానియా ఆసుప‌త్రి త‌ర‌లింపు ప్ర‌ధాన విష‌యాలే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను తిరిగి వెన‌క్కు తీసుకోవాల్సివ‌చ్చింది. దీంతో ఇక చేసేదేమి లేక తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని అక్ర‌మ నిర్మాణాలే కాదు భూముల అక్ర‌మ‌ణలు, వాటి క్ర‌మ‌ద్దీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. సాధార‌ణంగా సీఎం పని చేయాలనుకుంటే దానికి సంబంధించి ఒక నిర్ణ‌యాన్ని తీసుకున్నా త‌రువాత ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేస్తారు. గ‌డిచిన  ఏడాదిన్న‌ర కాలంగా సాగుతున్న తంతూ ఇదే. కానీ న‌గ‌రంలోని క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ విష‌యంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్న‌మైన వ్య‌వ‌హారానికి తెర లేపారు. అంతేకాకుండా గ్రేట‌ర్ లో ఎన్నిక‌ల నేపథ్యంలో పార్టీ ని బ‌లోపేతం లో భాగ‌మేన‌ని మ‌రి కోంద‌రు వాదిస్తున్నారు.


ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదారాబాద్ న‌గ‌ర‌లో విచ్చ‌ల‌విడిగా అక్ర‌మ నిర్మాణల‌తో పాటు భూముల ఆక్ర‌మ‌ణ‌లు కొన‌సాగాయి. దీంతో గతంలో తాను తీసుకున్న నిర్ణ‌యాల నేప‌థ్యంలో న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో దీనిపై న‌గ‌ర మంత్రుల‌తో పాటు సంబంధిత శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. న‌గ‌రంలోని క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కు సంబంధించి వివిధ అంశాల‌పై చ‌ర్చించిన సీఎం వారికి ప‌లు ర‌కాల సూచ‌న‌లు చేశారు. ఇందులో ప్ర‌ధానం గా ప‌లు అంశాల‌పై ఆధ్య‌య‌నం చేయ‌డంతో పాటు వాటి వ‌ల్ల క‌లిగే లాభ న‌ష్టాల‌ను కూడా బేరీజు వేయాల‌న్నారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌లు, ఇత‌రత్రా ఒత్తిడిల‌ను కూడా పరిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు న‌గ‌ర మంత్రులతో ఓ క‌మిటిని ఏర్పాటు చేశారు.


డాక్ట‌ర్. వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో క్ర‌మ‌బ‌ద్దీకర‌ణ‌ను రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం త‌ప్పుబ‌ట్టింది


ఈ క‌మిటీ ఏర్పాటుకు సైతం కార‌ణం లేక‌పోలేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మౌతున్నాయి. క్ర‌మబ‌ద్దీక‌ర‌ణ విష‌యాన్ని హైకోర్టు అంగీక‌రించే పరిస్థితి లేద‌ని అభిప్రాయాలు లేక‌పోలేదు. గ‌తంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్. వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో క్ర‌మ‌బ‌ద్దీకర‌ణ‌ను రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం త‌ప్పుబ‌ట్టింది. నాడు ఒక్క‌సారికి అవ‌కాశం క‌ల్పించిన కోర్టు మ‌రోసారి ఇటువంటి చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకూడ‌ద‌ని ఆదేశించింది. అలాగని కూల్చివేత‌ల‌ను ప్రారంభించే ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తోంది. చివ‌ర‌కు ఇది ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం. సీమాంద్రులు ఆక్ర‌మ నిర్మాణాల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పినా ఆ పాపంలో తెలంగాణ వారి సంఖ్య గ‌ణ‌నీయంగానే ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. ఇలా కూల్చివేత‌ల‌కు దిగితే స‌గం హైద‌రాబాద్ ను కూల్చివేయాల్సి వ‌స్తోందని కూడా చెబుతున్నారు. కూల్చి వేత‌ల‌తో ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఫ‌లితమేమి లేద‌ని భావిస్తున్నారు సీఎం కేసీఆర్.


క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తే స‌ర్కార్ కు వెయ్యి కోట్ల మేర కు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని యోచిస్తున్నారు. అలాగ‌ని క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తే హైకోర్టు నుంచి అంక్షిత‌లు త‌ప్ప‌వ‌ని ఆలోచించిన సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. హైకోర్టు నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైనా, క‌మిటీ సూచన‌ల మేర‌కు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే తెలియి జేయ‌వ‌చ్చ‌ని సీఎం అభిప్రాయప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఏదీ ఏమైనా నా గతంలో జరిగిన పొర‌పాట్ల‌లా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ విష‌యంలో ఇటు ప్ర‌జ‌ల‌తో పాటు అటు న్యాయ ప‌రంగా ప్ర‌భుత్వం ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ చ‌క్క‌టి ఆలోచ‌న‌ల‌కు తీసుకున్నార‌నే చెప్పాలి.


మ‌రో వైపు త్వ‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తుండంతో ఆచి తూచి వ్య‌వ‌హారించాల‌ని మంత్రుల‌కు, అధికారులు సూచిస్తున్న‌ట్లు  తెలుస్తోంది. హైద‌రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి పట్టు త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పుకోవాలి. ఇప్పుటికే కేసీఆర్ నిర్ణ‌యాల వ‌ల్ల గ్రేట‌ర్ ప్ర‌జ‌ల్లో కొంత‌వ‌ర‌కు వ్య‌తిరేక‌త పెరిగింది ఈ స‌మ‌యంలోనే కేసీఆర్ త‌న నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం, ఇది కేవలం రానున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ఎలాంటి అడంకులు ఉండొద్ద‌ని ఇప్పటి నుంచే దారులు వేస్తున్నార‌ని స‌మాచారం. ఎది ఎమైన ఈ నిర్ణ‌యాల వ‌ల్ల కొంత వ‌ర‌కు గ్రేట‌ర్ న‌గ‌రంలో కేసీఆర్ కు ప్ల‌సే అంటున్నారు రాజ‌కీయ మేదావులు.


మరింత సమాచారం తెలుసుకోండి: