విభజన చట్టంలో పెట్టిన అన్ని హామీలను అమలు చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో అందరికంటే ముందు ఉంటామని చెప్పారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎపి ప్రజలకు శాసనసభ ద్వారా భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  ఎట్టకేలకు సభా ముఖంగా చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఆయన ప్రకటన చేశారు. రాజ్యాంగ విలువలు పాటించ లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర విభజన ప్రక్రియ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా లేదని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఏ ప్రాంతంలో వున్న విద్యుత్‌ ప్రాజెక్టులు ఆ ప్రాంతానికే చెందాలన్నారు.  విభజన ప్రక్రియలో సమన్యాయం చేయాలని కోరారు. విభజన అనంతరం సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సాగునీటి సమస్య, విద్యుత్‌ సమస్య వస్తాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ వినియోగం మరింత పెరుగుతుందని, దీన్ని ఎలా అధిగమిస్తారో ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం దాపరికంగా ఉండవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం చూసుకోవాలసిన అవసరం తెలుగుదేశం ముందు ఉందని దీనికోసం అహర్షశలు పాటుపడతామన్నారు. .విభజన సమయంలో ఎవరిని సంప్రదించకుండా విభజన చేశారని అన్నారు. యుపిఎ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చాలా దుర్మార్గంగా చేశారని అన్నారు. హైదరా బాద్‌ ఆదాయం గురించి ఏమి చెప్పకుండా కేంద్రం వదిలి పెట్టిందని ఆరోపించారు.

ఏపీ అసెంబ్లీ


కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాజకీయ లబ్ధి తప్ప మరొకటి లేదన్నారు. అప్పట్లో రాష్ట్రపతి కి తాను లేఖ రాశానని ,ఆర్టికిల్ 143 ప్రకారం రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరామని అన్నారు.ఇద్దరి మనోభావాలు తెలుసుకుని ఎవరికి అన్యాయం చేయకుండా చూడాలని కోరానని అన్నారు. తాము చెప్పింది లెక్క పెట్టలేదని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విదంగా బిల్లును రక్షణ విమానంలో పంపించారని అన్నారు. ఇద్దరికి నచ్చచెప్పకుండా వార్ రూమ్ లో పెట్టి కాంగ్రెస్ ఎమ్.పిలను కోరారని అన్నారు.దేశ చరిత్రలో ఆర్టికిల్ మూడు కింద విభజన చేసింది మొదటి సారి అని ఆయన అన్నారు.గతంలో శాసనసభలో తీర్మానం చేసిన తర్వాతే విబజన జరిగిందని అన్నారు.అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగిందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: