ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాలక పక్షానికి, ప్రధాన ప్రతి పక్షానికి హోరా హోరీగా మాట యుద్దం కొనసాగింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దశలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాదు ప్రతిపక్షంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.ఇష్టం వచ్చినట్లు చేస్తే తాము ఏ విధంగా చేయాలో ఆ విదంగా చేసి తీరతామని చంద్రబాబు అన్నారు.

అంతకు ముందు రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో మరణించినవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రధ్దాంజలి ఘటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విపక్ష నేత జగన్ అన్నారు. విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చారని ఆరోపించారు.చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని ,సినిమాలో హీరోలా కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కేటాయించిన ఘాట్ వద్దకు చంద్రబాబు వచ్చారని అన్నారు. శాసనసభలో జగన్ ప్రత్యేక హోదా, పుష్కరాలలో మరణించిన ఘటనలపై జగన్ చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ ఈ హెచ్చరిక ఇచ్చారు.

అసెంబ్లీలో మాట యుద్దం కొనసాగిస్తున్న చంద్రబాబు,జగన్


సబ్జెక్ట్ చర్చిస్తే అభ్యంతరం లేదని, అలాకాకుండా ఏది బడితే అది మాట్లాడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. పద్దతిగా ఉండాలని ఆయన విపక్షానికి సూచించారు. పార్లమెంటులో తలుపులు వేసి,టీవీలు కట్టివేసి తీర్మానం చేసినప్పుడు ఎమ్.పిగా ఉన్న జగన్ ఎక్కడ దాక్కున్నారని ఆయన అన్నారు.  కేంద్రంతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని అంతే కాదు ఆంధ్రప్రదేశ అభివృద్ది కోసం అహర్శిశలు పాటు పడుతున్నానని రాష్ట్ర అభివృద్ది ఎలా సాధించాలన్న విషయం పై అసెంబ్లీలో చర్చలు జరిగితే బాగుంటుంది కానా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే సభా కాలాన్ని వృధా చేయడం ఒక్క జగన్ కే చెల్లిందని చంద్రబాబు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: