ఆంధ్రా అసెంబ్లీలో మాటల యుద్దం జోరుగా సాగుతోంది. డైలాగులు తూటాలు నాన్ స్టాప్ గా పేలుతున్నాయి. ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చ కాస్తా ఓటుకు నోటు కేసులోకి వెళ్లి విమర్శలు, ప్రతి విమర్సలతో హోరెత్తిపోతోంది. జగన్ పై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు సవాళ్లు ప్రతిసవాళ్లకు దారి తీశాయి. జగన్ కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.  

ఓటుకు నోటు కేసులో ఫిర్యాదు చేసిన స్టీఫెన్ సన్ కు అసలు సభ్యత్వం ఇచ్చిందే జగన్ సిఫారసు లేఖ మీద అని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్, హరీశ్ రావు ఓ హోటల్లో కూర్చుని కుమ్మక్కు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షనేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఏమయ్యా నేను కేసీఆర్ కు లెటరిస్తే.. ఆ లెటర్ నీకు ఎలా వచ్చింది. నీకెలా వచ్చింది.. ఆ లెటర్ నీకు కేసీఆర్ ఇచ్చారా.. చెప్పూ.. అంటూ ఆవేశపడిపోయారు.  

ఆ సమయంలోనే జగన్ అసెంబ్లీలో ఓపెన్ చాలెంజ్ విసిరారు.. ఆ స్టీఫెన్ సన్ ఎవరో నాకు తెలియదు.. ఛాలెంజ్ చేస్తున్నా.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే.. దాన్ని నిరూపించు.. అది నిజమని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తా.. రుజువు చేయలేకపోతే.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తావా.. చెప్పూ.. అంటూ జగన్ నిప్పులు చెరిగారు. ఛాలెంజ్.. ఛాలెంజ్.. ఛాలెంజ్.. అంటూ ముమ్మారు సవాల్ విసిరారు.  

జగన్ ఛాలెంజ్ పై అచ్చెన్నాయుడు స్పందన మాత్రం తేలిపోయింది. జగన్ సవాల్ కు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. జగన్ కుట్రలకు, కుమ్మక్కులకు ఆధారాలు చూపిస్తా అన్నారు. అన్నింటికీ ఆధారాలున్నాయన్నారు కానీ..అవి ఏంటో.. ఎక్కడ చూపిస్తారో చెప్పలేదు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు రొటీన్ డైలాగులే వినిపించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ కు ఓ సలహా ఇస్తున్నా.. ఏపీలో ఎన్నైనా చేయి.. ఏపీ జనాన్ని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ తో కలసి పని చేయడానికి మాత్రం పనిచేయకు అని సింపుల్ గా అని ఊరుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: