ఏపీ అసెంబ్లీలో ఈ రోజు కూడా ఆరోపణలు..దూషనలు..సవాల్ కు ప్రతి సవాళ్లతో మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఓటు కోసం కోట్లు కేసులో దొరికిపోయారని,పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా వరకు కమిషన్ లు తీసుకుంటూ అక్రమ సంపాదన చేస్తున్నారని విపక్ష నేత జగన్ ఆరోపించారు.శాసనసభలో ప్రత్యేక హోదా పై చర్చ సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయగానే అదికార పక్షం నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది.

టీఆర్ఎస్ సర్కారుతో కుమ్మక్కై.. తమ నేతలను ఓటుకు నోటు కేసులో ఇరికించారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు విపక్ష నేత జగన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.."నేను.. కేసీఆర్ కు లేఖ రాస్తే.. ఆ లేఖ అచ్చెన్నాయుడు కి ఎవరు ఇచ్చారని?.. కేసీఆర్, అచ్చెన్నాయుడు కి ఇచ్చారా?" అని ఎద్దేవా చేసారు జగన్. ఇంకా" తాను కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా లేదా హరీష్ ను అదేదో హోటల్ లో కలిసినట్టుగా నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా... నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా? ఇందుకు సిద్ధమా? సవాల్... చాలెంజ్... చాలెంజ్... చాలెంజ్" అంటూ సవాల్ విసిరారు.

ఏపీ అసెంబ్లీ

kodela siva prasada rao appeal to opposition in andhra pradesh assembly

తనకసలు స్టీఫెస్ సన్ ఎవరో తెలియదని జగన్ స్పష్టం చేసారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ ఊరుకోరని.. సత్యదూరమైన మాటలు మాట్లాడితే..ఫలితం దారుణంగా ఉంటుందని  తాను టీఆర్ఎస్ తో కుట్ర పన్నినట్లు నిరూపిస్తే ఖచ్చితంగా  రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: