ప్రతిపక్షనేత జగన్ కూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికూ ఉన్న వైరం సంగతి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అది బహిరంగ రహస్యమే.. ఆంధ్ర్జజ్యోతి, పత్రిక ఛానల్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాయని.. చంద్రబాబుకు బాకా ఊదుతున్నాయని జగన్ పలుసార్లు బహిరంగంగానే విమర్సించారు. లేటెస్టుగా ఓ ప్రెస్ మీట్లోనూ.. ఆ పత్రిక విలేఖరిపై జగన్ చిందులు తొక్కారు.. పచ్చచొక్కా వేసుకుంటే బావుండేది అంటూ సెటైర్లు వేశారు. 

బయట ప్రెస్ మీట్లతో పాటు జగన్.. అసెంబ్లీలోనూ ఏబీఎన్ ఛానల్ ను వదిలిపెట్టడం లేదు. అసెంబ్లీ ప్రసారాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టును ఏబీఎన్ రాధాకృష్ణ దక్కించుకున్నారు. అయితే ఇందులో గూడుపుఠాణి ఉందని జగన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపుకోసం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి చేసిన సాయానికి కృతజ్ఞతగానే ఈ లైవ్ కాంట్రాక్టు రాధాకృష్ణకు దక్కిందన్నది వైసీపీ వర్గాల ఆరోపణ. 

అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలన్నా స్పీకర్ మైక్ ఇవ్వాలి. ఒక వేళ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు.. దాన్ని ఆపేయాలంటే స్పీకర్ మైక్ కట్ చేస్తే చాలు.. ఎవరికీ వినిపించవు.. సాధారణంగా ప్రతిపక్షాలు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం ఆనవాయితీ.. స్పీకర్ అధికారపార్టీకే చెందిన వారు ఉంటారు కాబట్టి.. దాని ప్రభావం ఈ మైక్ ఇవ్వడం, కట్ చేయడంలోనూ ఉంటుంది. 

లేటెస్టుగా అసెంబ్లీలో జగన్ మాట్లాడేటప్పుడు పలుసార్లు ఇలా మైక్ కట్ చేయడం.. అడిగిన వెంటనే మైక్ ఇవ్వకపోవడం జరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షనేత జగన్ ఆరోపణలు గుప్పిస్తూ.. ఏం చేస్తాం మన  ఖర్మ.. ఈ లైవ్ టెలికాస్టు ఏబీఎన్ ఛానల్ కు ఇచ్చారు. వాళ్లు వాళ్ల ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మేం మాట్లాడుతుండగానే కట్ చేస్తారు.. మా ఆందోళనలను చూపించరు.. ఇక వాళ్లు పచ్చచొక్కాలు వేసుకోవడమొక్కటే తక్కువ.. ఇలాంటి కామెంట్లు జగన్ సభలో తరచూ చేస్తున్నారు. స్పీకర్ ఏమనుకున్నారో ఏమో కానీ ఈ కామెంట్లపై మాత్రం ఏం వ్యాఖ్యానించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: