ఏపీ అసెంబ్లీలో మూడవ రోజూ కూడా  వైసీపీ నినాదాలు, నిరసనతో, దూషనలు..సవాల్ కు ప్రతి సవాళ్లతో మొదలైంది. ఇక మహిళా నాయకురాళ్లు ఒకరి పై ఒకరు మాటల యుద్దం కొనసాగించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పైన మంత్రి పరిటాల సునీత బుధవారం నాడు శాసన సభలో విరుచుకుపడ్డారు. తెలుగు దేశం మంత్రి పరిటాల సునిత తన భర్త  పరిటాల రవి అతి దారుణంగా చంపిన విషయం గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో రోజా తెగులు దేశం పార్టీలో కొనసాగుతున్నపుడు పరిటాల రవి ఫోటో పట్టుకొని గ్రామ గ్రామానికి తిరుగుతూ ఆయన ఫోటోలకు దండ వేస్తూ పరిటాల హత్య దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయించిన హత్యే అని ప్రజలతో చెప్పారని అలాంటి రోజా ఇప్పుడు పార్టీ మారి తెలుగు దేశంపై విమర్షలు గురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్యే పదవిలోకి రాగానే ఇప్పుడు తనూ..తన కొడుకు హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఏపీ అసెంబ్లీ

kodela siva prasada rao appeal to opposition in andhra pradesh assembly

పార్టీ పటిష్ట కోసం ప్రజా సంక్షేమం కోసం తన భర్త అడుగు జాడల్లో నడుస్తున్నానని తన కొడుకు కూడా తండ్రి లక్ష్య సాధన కోసమే పార్టీ సేవ చేస్తున్నాడని హత్యారాజకీయాలు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమే అని పరిటాల సునిత అన్నారు. నోరు ఉంది కదా అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తర్వాత సమాధానం మీరు చెప్పాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఉల్లిగడ్డ ధర పెరుగుపై మాట్లాడుతూ... ఉల్లి గడ్డ ధర తగ్గే వరకు తాము రూ.20కి కిలో ఇస్తామని చెప్పారు. 10,600 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డను తాము కొనుగోలు చేసి, సరఫరా చేశామని చెప్పారు. కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: