ఈ రోజు అసెంబ్లీలో వాడీ వేడిగా మాటల యుద్దాలు కొనసాగాయి.. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్తిని రిషితేశ్వరి ఘటనపై బుధవారం శాసనసభలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, నగరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజాల మద్య మాటల యుద్దం జరిగింది.

 ఒకరి పై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు ఒక దశలో అవి వ్యక్తిగత విషయాలకు కూడా దారితీసింది.  రిషికేశ్వరి ఆత్మహత్య వ్యవహారం అంత సీరియస్ గా ఉంటే..మన ఏపీ విద్యాశాఖా మంత్రి  శ్రీమంతుడు ఆడియో కాసెట్ విడుదల కార్యక్రమానికి వెళ్లడాన్ని రోజా తప్పు పట్టారు. వెంటనే స్పందించిన గంటా తానేమీ రెగ్యులర్ గా ‘జబర్థస్త్’ కార్యక్రమానికి ఏమీ వెళ్లలేదుకదా..అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని రోజా అన్నారు. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు.

ఏపీ అసెంబ్లీ

kodela siva prasada rao appeal to opposition in andhra pradesh assembly

ఆడపిల్లల ప్రాణాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి విలువ లేదా అని రోజా ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. మంత్రి గంటా నాగార్జున యూనివర్శిటీకి రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన జరిగిన నాలుగు రోజులకు వెళ్లారని, అక్కడ నుంచి హడావుడిగా శ్రీమంతుడు ఆడియో విడుదల కు వెళ్లిపోయారని విమర్శించారు. దీనిపై గంటా బదులు ఇస్తూ..తన స్నేహితుడి సినిమా కావడంతో సామాజిక బాధ్యతగా తాను ఆ సినిమా ఆడియో పంక్షన్ కు వెళ్లానని, అంతేకాని జబర్దస్త్ కార్యక్రమానికి వెళ్లి ఎంజాయ్ మెంట్ ఏమీ చేయలేదని అన్నారు. ఇలా సభలో వీరి మద్య సంభాషణ చూస్తూ అందరూ ఆశ్చర్య పోయారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: