ఈ కాలంలో మనిషి డబ్బు కోసం నానా గడ్డి తింటున్నాడు.. ఎక్కడి నుంచి వచ్చింది కాదు..ఎలా వచ్చింది కాదు.. ఎంత సంపాదిస్తున్నాం అన్నదే ధ్యేయంగా బతుకుతున్నారు. సంఘంలో తన స్వార్థం తనే చూసుకునే ఈ రోజుల్లో పేద వారికోసం కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా అన్నం పెట్టి వారి భాదలు తీరుస్తున్నాడు ఓ మనసున్న మారాజు. వివరాల్లోకి వెళితే..  తమిళనాడులోని వెంకట్రామన్ ఓ మెస్ యజమాని రూపాయికి అన్నం పెడుతూ పేదల కడుపు నింపుతున్నాడు.

తమిళనాడులోని ఈరోడ్ పట్టణం ఏఎంవి హోమ్లీ మెస్ యజమాని. అక్కడి ప్రభుత్వా ఆస్పత్రిలోని రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూపాయికే భోజనం పెడుతున్నాడు.  మరి ఇలా ఒక్క రూపాయికే అన్నం పెట్టడం ఏమిటా అనుకుంటున్నారా దీనికో ఓ కథ ఉంది.. ఒక రోజు వెంకట్రామన్ వద్దకు ఓ వృద్దురాలు వచ్చిందట.. 10 రూపాయలకు మూడు దోషలు వేసి ఇచ్చాడట..అది చూసి ఆమె దీనంగా ఈ పదిరూపాయలే తన వద్ద ఉన్నాయని వీటితోనే ఈ పూటంతా గడపాలని దీనంగా అనండంతో వెంకట్రామన్ మనసు చలించి పోయిందట.. అసలు ఇలాంటి నిరుపేదల ఆసుపత్రిలో ఎంత మంది ఉన్నారో అని ఆరా తీయగా చాలా మంది ఉన్నట్లు తెలిసింది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆసుపత్రికి రోగులతో వచ్చే వారి సహాయకులకు ఒక్క రూపాయకే కడుపు నిండా బోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడట.

టోకెన్ ద్వారా ఒక్కరూపాయికే భోజనం పెడుతున్న వెంకట్రామన్


ఈ విషయాన్ని తన భార్యతో చెప్పగా ఆమె కూడా సంతోషించిందట..  అయితే ఈ కార్యక్రమాన్ని మొదట కొద్ది మందితో మొదలు పెట్టారు అంటే టోకన్ల సిస్టమ్ ద్వారా.. రోజూ ఉదయం 10 మంది రోగుల సహాయకులకు టిఫిన్ టోకెన్లు ఇస్తారు. రూపాయికే మూడు దోసెల పార్సిల్ ఇస్తారు. మధ్యాహ్నం 40 మందికి రూపాయికే భోజనం ప్యాకెట్లు ఇస్తారు. సాయంత్రం 20 మందికి రూపాయికే దోసె, చపాతి పార్సిల్ ఇస్తారు.  కానీ రెగ్యులర్ కస్టమర్లకు మాత్రం ఈ మినహాయింపు ఉండదు.. వారి వద్ద 50 రోపాయలు తీసుకుంటారు. వెంకట్రామన్ చేస్తున్న ఈ సేవ చూసి ఎంతో మంది ఆయనను అభినందించారు.. ఇక ఆయన చేత కడుపునిండా అన్నం తిన్న వారు దీవించి వెళుతున్నారు. వెంకట్రామన్ త్వరలో   టోకెన్ల సంఖ్యను 100కు పెంచాలని భావిస్తున్నారు. రూపాయికి భోజనం పెట్టడం వల్ల నష్టం వస్తున్నా, మానవతా దృష్టితో కొనసాగిస్తామని వెంకట్రామన్ దంపతులు చెప్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: