వరంగల్ జిల్లా కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేపట్టిన కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. ప్రాజెక్టు పనుల తీరుపై నిరసనగా ఆయన వరంగల్ జిల్లా ఏటూరునాగారం నుంచి తన యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేవాదుల ప్రాజెక్టు వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేపట్టారు.   తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి దీనిని చేపట్టారు.  


ఈ యాత్రలో భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకున్నారు. అయితే, ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేపట్టిన కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా కంతనపల్లి ప్రాజెక్టు వద్ద కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. కిషన్ రెడ్డి కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేపట్టాలని భావించారు. తన అరెస్ట్‌ వెనక రాజకీయకోణం ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఎన్నడూ అరెస్ట్‌ కాలేదని ఆయన విమర్శించారు.

కిషన్ రెడ్డి పాదయాత్ర


పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రానికి..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల బాట లో భాగంగా కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహించతలపెట్టారు.పోలీసులు చుట్టుముట్టినప్పుడు కార్యకర్తలకు ,పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసుల కిషన్ రెడ్డిని అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: