వైసీపీలో చేరిన మొదట్లో మైసూరారెడ్డికి తగిన ప్రాధాన్యమే ఉండేది. జగన్ ఏదైనా సీరియస్ ఇష్యూల్లో మైసూరా అనుభవాన్ని ఉపయోగించుకునేవారు.. కానీ ఇప్పుడు ఆ సీన్ మారినట్టు కనిపిస్తోంది. క్రమంగా మైసూరాకు వైసీపీలో ప్రాధాన్యం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఈయన ఎప్పుడోగానీ ప్రెస్ ముందుకు కూడా రావడం లేదు. 

వైసీపీ మీటింగుల్లోనూ ఆయనకు అంత ప్రాధాన్యం లభించడం లేదట. అంతే కాదు.. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ మైసూరాకు ప్రాధాన్యం తగ్గించారట. ఇటీవల హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రకార్యాలయాన్ని ఖర్చుకు తగ్గించుకునేందుకు లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి మార్చేశారు. అధికారంలో లేనప్పుడు.. కనుచూపు మేరలో ఆ ఛాన్స్ కనిపించనప్పుడు డాబులు ఎందుకని ఆ పార్టీ అధినాయకత్వం ఫీలవుతోంది. 

పాత కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల రూంలో మైసూరాకు ఓ గది ఉండేది. ఆఫీసు లోటస్ పాండ్ కు మార్చాక కూడా ఓ ఫ్లోర్ లో మైసూరాకు ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. మైసూరా కూడా రోజూ ఆఫీసుకు వచ్చి పోతూ పార్టీ కార్యకలాపాలపై ప్రెస్ మీట్లు పెడుతుండేవారు. అయితే రీసెంటుగా మైసూరాకు కేటాయించిన గది ఉన్న ఫ్లోర్ ను తెలంగాణ విభాగానికి కేటాయించారు. 

సో.. ప్రస్తుతం మైసూరాకు ప్రత్యేకంగా ఓ రూం అంటూ లేకపోయింది. అయితే ఇక్కడ ఓ విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. మైసూరాకు కావాలంటే ఓ గది కేటాయించొచ్చు.. కానీ ఆ పని జరగడం లేదు. ఇది కావాలని జరగడం లేదా.. యాదృశ్చికంగా లేట్ అవుతుందా అన్నది తెలియడం లేదు. మైసూరా కూడా ఇది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అసలే రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న మైసూరాకు ఇప్పుడీ గది అవమానం కూడా తోడవడంతో బాగా ఫీల్ అవుతున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: