అధికార పార్టీని ప‌నిచేసేవిధంగా కానీ, లేక అధికార పార్టీని ఇరుకున్న పెట్టి, ప్ర‌జ‌లముందు దోషిగా చూపించి రానున్న రోజుల్లో అధికారం కైవ‌సం చేసుకొవ‌డానికి మాత్ర‌మే ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌నిచేస్తున్నాయి. ఇందుకు అధికార పార్టీలు ప్ర‌జ‌ల‌కోసం ఎలాంటి ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చినా.. అది త‌ప్పు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది రాకుడ‌దు అంటూ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అధికార పార్టీ పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హజం. ఈ తంతూ దాదాపు అన్ని దేశాల్లో ఉంటాయి. దీనికి అధికార ప్ర‌భుత్వం ఎలాగైనా త‌న ప‌థం నెర‌వేర్చుకునేందుకు ఇష్ట ప‌డ‌తారు. దాదాపుగా తీసుకున్న నిర్ణ‌యం తప్పైనా ఒప్పైనా  అమ‌లు చేసుకుపోవ‌డానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హారం వీటికి భిన్నంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెన‌క్కుతీసుకుని ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా చేస్తున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు మ‌రో ఇష్యూను వెతుక్కునే ప‌నిలో పడ్డారు.

చీప్ లిక్క‌ర్ అంటూ పోరాటం చేసిన ప్ర‌తిప‌క్షాలు


నిన్న మొన్న‌టి వ‌ర‌కూ చీప్ లిక్క‌ర్ అంటూ పోరాటం చేసిన ప్ర‌తిప‌క్షాలు తీరా దానిపై ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గ‌డంతో మ‌రో కొత్త ఆంశాన్ని వెతుక్కోవాల‌సిన ప‌ని ప‌డింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చీప్ లిక్క‌ర్ ను ప్ర‌వేశ పెట్టాలిన అనుకున్న‌ప్పుడు బహుశా ఈ  అనుభ‌వాల‌తోనే అన్ని రాజ‌కీయ పార్టీలు ఆ నిర్ణ‌యంతో ముక్త‌కంఠంతో ఖండించాయి. మ‌హిళా సంఘాలు భారీ  ఎత్తున త‌మ నిర‌స‌న‌లు తెలిపాయి. చీఫ్ లిక్క‌ర్ కు గెట్లు తెరిచే కొత్త మ‌ద్యం పాల‌సీ ని అమలు చేయ‌కూడ‌ద‌ని తెలంగాణ మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించ‌డంతో వారంతా శాంతించారు. ఈ నిర్ణ‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు హర్షిస్తున్నారు. మ‌హిళా సంఘాలు కూడా సంతోషిస్తున్నాయి. చీప్ లిక్క‌ర్ ను ప్ర‌వేశ పెట్టాల‌నే యోచ‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం విర‌మించుకున్నందుకు ప‌ల్లె ల్లోని ప్ర‌తి ఆడ‌బిడ్డా ఆనందం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతానికి ఛీప్ లిక్క‌ర్ లేదు. అని తెలంగాణ మంత్రి వ‌ర్గం చేసిన నిర్ణ‌యం శాశ్వ‌తం కావాల‌ని కూడా ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నారు. ప్ర‌తి ప‌క్షాలు రాద్దాంతం చేసిన ఈ వ్య‌వ‌హారం లో ఆధికార పార్టీకి అనుకూలించింది.

పురాత‌న క‌ట్ట‌డమైనా ఉస్మానియా హాస్పిట‌ల్


మ‌రోవైపు పురాత‌న క‌ట్ట‌డమైనా ఉస్మానియా హాస్పిట‌ల్ ను మార్పున‌కు ముందుకు వచ్చినా తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి. వాస్త‌వానికి ఉస్మానియా ఆస్ప‌త్రి ప‌రిస్థితిని చూస్తుంటే ఏ క్షణంలో కుప్ప‌కూలే పరిస్థితి ఉంది. ఇందులో దాదాపు వేల మంది ప్ర‌జ‌లు వివిద రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వస్తారు. గ‌త వంద సంవ‌త్సార‌ల క్రితం నిర్మించిన ఈ భ‌వనాన్ని ఇలానే ఉంచితే పేను ప్ర‌మాదం రాక మాన‌దు . ఇందుకోసం సీఎం కేసీఆర్ పాత‌భ‌వనాన్ని కూల్చి ఇదే స్థ‌లం లో కొత్త భ‌వనాన్ని నిర్మిస్తామ‌ని, హాస్పిట‌ల్ మార్పు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌తి ప‌క్షాలు శాంతించాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు అడ్డుకోవ‌డం పై అక్క‌డి ప్రాంతపు వాసులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌ని భ‌వ‌నం లో ఎలా వైద్యం చేయించుకోవాలో ప్ర‌తిప‌క్షాలు తెలపాల‌ని వారు కోరారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు వెను తిర‌గాల్సి వ‌చ్చింది.


ప్రాజెక్టుల విష‌యంలో కూడా ప్రతి ప‌క్షాల‌కు కేసీఆర్ దీటైన జ‌వాబె ఇచ్చారు. ప్రాణ‌హిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి ప్ర‌తి ప‌క్షమైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. ప్రాణ‌హిత- చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును అంగీక‌రించే ప్ర‌శ్నే లేద‌ని కాంగ్రెస్ పార్టీ తేల్చింది. ఈ ప్రాజెక్టును తుమ్ముడి హ‌ట్టు వద్దే నిర్మించాల‌ని పట్టు పట్టింది. ఈ దిశ‌గా పాల‌క ప‌క్షం పై ఒత్తిడి తేవ‌డానికి కార్య‌చ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని భావించింది. ఇష్టం వ‌చ్చినట్టు నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి మీ ఇంటి ప్రాజెక్టు కాద‌ని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి విమ‌ర్శలు గుప్పించారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. ముంపు ప్రాంతాన్ని అదిగ‌మించేందుకు సాగునీటిని మరింత పెంచుకునేందుకు ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.  అంతేకాకుండా తుమ్మిడిహట్టిలో మ‌రోప్రాజెక్టు ను క‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రేండెళ్ల‌లో పూర్తి చేయాల‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప్రతిప‌క్షాలు నోర్లు మూసుకున్నాయి.


ఇక మ‌రో సారి ఇందిర‌మ్మ ఇళ్ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై, రైతుల ఆత్మ‌హాత్య‌ల‌పై, పించన్ ల‌పై వ్య‌వ‌హారంపై తీవ్రంగానే ప‌ట్టుబ‌డుతున్నా.. వాటిపై స‌రైన రీతిలో ఎదురుకోవ‌డంలేదు. ఇక ఇందిర‌మ్మ ఇళ్ల పై తీవ్ర అవ‌క‌త‌వ‌కలు జ‌రిగాయని, చెబుతూ వాటి పై సీఐడీ ద‌ర్యాప్తుకు ఆదేశించారు కేసీఆర్. ఇక మేనిపెస్టోలో చెప్పినట్టు గా ఒక‌దాని త‌రువాత ఒక‌టి చేసుకుంటు పోతున్నారు. కొద్ది గా  ఆల‌స్య‌మైనా ఇచ్చిన హామీలకు నెర‌వేర్చుతాన‌ని కేసీఆర్ చెబుతూ ఉన్నారు. రైతుల ఆత్మ‌హత్యల‌పై అధికార ప‌క్షాన్ని నిల‌దీసేందుకు స‌రైన పంథాను ఎన్నుకొవ‌డంలో ప్ర‌తిప‌క్షాలు విఫ‌ల‌మౌతున్నాయి. ఈ స‌మ‌స్య‌ను ఎదురుకునేందుకు కేసీఆర్ ముందుగానే రైతుల అత్మ‌హత్య‌ల‌ను ఆపాడానికే  ఈ ప్రాజెక్టును రీ డిజైన్ లను చేస్తున్నామ‌ని తెలిపారు. అత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డిన కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని, డ‌బ్బులు సైతం క‌లెక్ట‌ర్లు అకౌంట్ల‌ల్లో వేశామ‌ని తెలిపారు.


   
ఇక ఇప్ప‌డికిప్పుడు కొత్త ఇష్యూ ను ప‌ట్టుకోవాలంటే కాస్తంత క‌ష్ట‌మైన ప‌నే. అలా కొత్త వివాదం మ‌రోక‌టి దొరొకేదాకా ప్ర‌తిప‌క్షాల‌కు వేచి చూడాల్సిందే. కొత్త‌గా ఏదైనా ప్ర‌క‌ట‌న చేస్తే.. అందులో తాము ప‌ట్టుకోగలిగే ఇష్యూ ఉండాలి. లేదూ నిన్న మొన్న‌టి వ‌ర‌కూ చీప్ లిక్క‌ర్ అంటూ పోరాటం చేసిన ప్ర‌తిప‌క్షాలు తీరా దానిపై ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గ‌డంతో మ‌రో కొత్త అంశాన్ని వెతుక్కోవాల్సిన ప‌ని ప‌డింది. ఇప్ప‌టికిప్పుడు ఆ స్థాయి లో కొత్త ఇష్యూ ప‌ట్ట‌కోవాలంటే కాస్తంత క‌ష్ట‌మైన ప‌నే. అలా కొత్త వివాదం మ‌రొక‌టి దొరికే దాగా ప్ర‌తిప‌క్షాల‌ను సెవ‌ల‌న్న‌ట్టే..!



మరింత సమాచారం తెలుసుకోండి: