కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజుల ఉదయం 10:30గంటలకు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామ పత్రాన్ని సభాపతి నాదేండ్ల మనోహర్ కు అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. గత కొద్దిరోజులుగా పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సిఎంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు ఎమ్మెల్యే రాంచంద్రారెడడ్డి తన పదవికి రాజీనామ చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే ఒక్కరోజు ముందు తన రాజీనామాను అందజేశారు. కాగా పెద్దిరెడ్డిని రాజీనామ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఒప్పించడం కోసం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, తాజా చీఫ్ బోత్స సత్యసత్యనారాయణలు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పెద్దిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: