కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా పనిచేసిన నాయకుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎంటే తెలియని వారు ఉండరు. విభజన సమయంలో కాంగ్రెస్ తరుపున హల్ చల్ చేసిన నాయకుడు. ఇక రాజకీయాల్లో పార్టీలు మారడం కామన్ అధికార పార్టీ ఏదైతే ఆ పార్టీ లోకి సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నాయకుల వరకు జంప్ జలానీలు అవుతుంటారు. తాజాగా  విజయవాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ వెనుక ఆంతర్యమేంటి? అనే అంశాలపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది.

ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల సమక్షంలో జరిగిన ఈ భేటీలో రాజకీయ అంశాలేమీ ప్రస్తావనకు రాలేదని సమాచారం. రాష్ట్రం విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లగడపాటి గతంలో ప్రకటించారు. విభజన జరగడంతో ఆ ప్రకారమే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపార వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ల్యాంకో కంపెనీల ఛైర్మన్ హోదాలోనే చంద్రబాబుతో భేటీ అయిన రాజగోపాల్ వ్యాపార అంశాలనే పది నిమిషాల పాటు చర్చించినట్టు వినికిడి.

టీడీపీ లోగో


రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రప్పించి ఆయన సేవలు వినియోగించుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందనే భావన టీడీపీ వర్గీయుల్లో ఉంది..! ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో రాజగోపాల్ భేటీ కీలక పరిణామానికి నాందీ పలకనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే రాజగోపాల్ టీడీపీలో చేరనున్నారని, ఇందుకు సన్నాహకంగానే చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: