ఏపీలో చంద్రబాబు సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ఈనాడు దాదాపుగా పాజిటివ్ కథనాలు.. ఆహా.. ఓహో కథనాలే ఇచ్చింది. ఈ తెలుగు ప్రజల అభిమాన పత్రిక స్వరంలో ఈ మధ్య కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వంలో తప్పొప్పులను బాగానే ఎత్తి చూపుతోంది. ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, కేరళలో అనంతపురం రైతుల ఘోష వంటి కథనాలు వరుసగా ప్రచురించిన ఈ పత్రిక ఇప్పుడు టీడీపీనేతలకు షాకుల మీద షాకులిస్తోంది. 

ఇక మంగళవారం ఈ పత్రిక ఆంధ్రా ఎడిషన్ చూసిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మళ్లీ షాకయ్యారు. ఎందుకంటే.. ఏదో ఒక కథనం ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదిగా ఉండటం కామన్. కానీ ఈ రోజు మాత్రం ఈనాడు విశ్వరూపమే చూపించింది. ఏపీలోని సారా విజృంభణపై ఏకంగా ఓ స్పెషల్ పేజీ కథనం ప్రచురించింది.

అంతే కాదు.. ఇవాళ్టి ఈనాడు పేపర్ ఫస్ట్ పేజ్ అంతా గవర్నమెంట్ నెగిటివ్ వార్తలే. సారా రక్కసి కథనం, పట్టణాల్లో హరిత పన్ను విధించబోతున్నారన్న వార్త, విశాఖ అదితి ఉదంతం నేపథ్యంలో.. కొట్టుకుపోతున్నారనే టైటిల్ తో కాల్వల నిర్వహణలో సర్కారు వైఫల్యంపై ఏకేసే కథనం, చేయి రాదేం.. పేరుతో అనంతపురం రైతులకు సబ్సిడీ అందడం లేదనే కథనం, రాష్ట్రంలో 200 కరవు మండలాలు అనే మరో నెగిటివ్ కథనం.. 

ఇలా ఒక్క ఫస్ట్ పేజ్ లోనే ఐదు నెగిటివ్ కథనాలు చూసి.. టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఇది ఈనాడు పేపరేనా.. పొరపాటున సాక్షి చూస్తున్నామా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు. ఏదేమైనా.. ఈనాడు ఇలా ప్రజాసమస్యలపై దృష్టిపెట్టడం మాత్రం ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: