ఇప్పుడు అశ‌క్తిక‌రంగా మారిన విష‌మేమిటంటే.. ఏపీ రాజ‌ధాని శంకుస్థాప‌నకు తెలంగాణ సీఎం కు ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారా?  లేదా అని. ఆంద్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి శంకు స్థాప‌న‌కు ద‌స‌రా రోజు చేప‌డుతున్న సంగ‌తి విధితమే. ఇప్ప‌టికే దీని కోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని భారీగా చేప‌ట్ట‌టంతో పాటు.. చ‌రిత్రలో నిలిచిపోయేలా చేయాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు యోచిస్తున్నారు. దాదాపు ల‌క్ష మందితో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి  వివిఐపీలు, సింగ‌పూర్ ప్ర‌ధాని, దేశ ప్ర‌ధాని మోడీ తో పాటు రాష్ట్రాల‌కు చెందిన ఆయా ముఖ్య‌మంత్రులు, ప్ర‌ముఖులు ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌ను ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఇవ్వ‌డం కూడా పూర్త‌యింది.

మోడీ ని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు


తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ ప్ర‌దాని న‌రేంంద్ర‌మోడీ ని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు గానూ ప్ర‌ధాని త‌ప్ప‌ని స‌రిగా వస్తాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి  సానుకూలంగానే ఉంటూ వ‌స్తున్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో సైతం కేంద్ర ప్ర‌భుత్వం బాబు ను కాపాడింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  కేంద్ర క్యాబినెట్ ను ఆహ్వనం కూడా దాదాపు గా అందాయి. సింగ‌పూర్ ప్ర‌ధానులు, వివిధ ప్ర‌జాప్ర‌తినిధులకు సైతం ఆహ్వానించారు. దేశ నాయ‌కులు, విదేశి ప్ర‌జాప్ర‌తినిదులు, వివిధ రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌జాప్ర‌తినిదులు క‌లిపి దాదాపు 1 ల‌క్ష మంది ఈ కార్య‌క్ర‌మానికి హ‌జరు కావ‌చ్చ‌ని ఏపీ ప్ర‌భుత్వ భావిస్తోంది. ఇందుకు గానూ ఏపీ ప్ర‌భుత్వం స‌రైన ఏర్పాట్లే చేస్తోంది 


ఇక‌పోతే.. ద‌స‌రా రోజున ఏపీ స‌ర్కార్ నిర్వ‌హించే అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ తెలంగాణ తెలుగుదేశం నేత‌ల‌కు ఆహ్వానం అందించారు చంద్ర‌బాబు. ఎవ‌రేవ‌రు హ‌జ‌వుతారో చెబితే.. వారికి త‌గ్గ‌టు షెల్ట‌ర్ ను ఏర్పాటు చేయ‌డానికి సైతం సంసిద్దం చేసిన‌ట్టు స‌మాచారం. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి,  అధికార ప‌క్ష నేత‌ల‌కు ఏపీ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మ ఆహ్వానం ఉంటుందా? ఉంటే.. ఎవ‌రు వెళ్లి సీఎం కేసీఆర్ కు ఆహ్వాన ప‌త్రిక ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ఆహ్వాన‌మే అందితే కేసీఆర్ ఎలా స్పందిస్తారో అన్న‌దానిపై వాడి వేడి చ‌ర్చే మొద‌ల‌య్యింది. వాస్త‌వానికి ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన రాజ‌దాని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంతో పాటు ప్రభుత్వ ప‌రంగా చేప‌డుతున్న నేప‌థ్యంలో ప‌క్క రాష్ట్ర‌మైన తెలంగాణ ఇవ్వ‌డం గౌర‌వ‌మే. 


మ‌రో వైపు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ సీఎం ను సైతం ఆహ్వానిస్తార‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఒక‌వేళ అలాంటిదే జ‌రిగితే తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఏలాంటి స్పందన రానుందో న‌న్న‌ వార్త‌ ఇప్పుడు రాజ‌కీయంగా ఆశ‌క్తి గా మారింది. దేశంలో ఉన్న వివిద రాష్ట్రాల సీఎం ల‌కు ఆహ్వానం అందాయి. కానీ ప్ర‌క్క రాష్ట్రమైన తెలంగాణ  సీఎం కు ఆహ్వానం అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇరు రాష్ట్రాల మ‌ద్య దాయాది పోరు నడుస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ఆశ‌క్తి కరంగా మారింది.  ఇక గ‌త రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఇద్ద‌రి చంద్రులు మ‌ద్య ప‌చ్చి గ‌డ్డి వేస్తే నే భ‌గ్గు మంటుంది. చంద్ర‌బాబు తీరుతో తెలంగాణ లో సీఎం కేసీఆర్ పాల‌నకు తీవ్ర ఆటంకమే ఏర్ప‌డింది. తెలంగాణ‌కు కేంద్ర నుంచి రావ‌ల‌సిన నిధుల‌ను సైతం త‌మ రాష్ట్రానికి  మ‌ల‌పుకొవ‌డ‌మేకాకుండా..  పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం పై చంద్ర‌బాబు అడుగ‌డుగునా అడ్డుకట్ట వేస్తున్నార‌ని కేసీఆర్ తీవ్ర ఆరోప‌ణ‌లేకాదు, బాబుపై చిన్న‌పాటి యుద్ద‌మే చేస్తున్నారు. 


కేసీఆర్ వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబుకు  కూడా  తీవ్ర న‌ష్ట‌మే జ‌రిగింద‌ని చెప్పాలి. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబును ముద్దాయిని చేయ‌డ‌మే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి తీవ్ర న‌ష్టమే జరిగింది. అంతేకాకుండా తెలంగాణ లో ఉన్న టీడీపీ సీనియ‌ర్ నాయకుల‌ను పార్టీ లోని ఆహ్వానించి ఈ ప్రాంతంలో మ‌నుగ‌డలే దెబ్బ‌తినేలా చేశారు గులాబీ నేత కేసీఆర్. దీంతో ఇద్ద‌రు చంద్రుల మ‌ద్య అటు పాల‌నా ప‌రంగా ఇటు రాజకీయ ప‌రంగా చాలా గ్యాబే వ‌చ్చింది.  ఇక‌పోతే రాష్ట్రం విడిపోయిన అనంత‌రం అధికారాల్లోకి వ‌చ్చిన ఇద్ద‌రు చంద్రుల మద్య క‌ల‌యిక దాదాపు లేన‌ట్టుగానే క‌నిపించింది.  గ‌త పంద్రాగ‌ష్టు సందర్భంగా ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ నర‌సింహాన్ ఇచ్చిన తేనీటి విందుకు వస్తార‌ని భావించిన తెలుగు సీఎం లు డుమ్మా కొట్టారు. మ‌రో వైపు తెలంగాణ  త‌మ్ములు సైతం కేసీఆర్ పై ఆహ్వానం పై సుముఖ‌త తెలుపుతున్నటు తెలుస్తోంది. టీటీడీపీ పై సీఎం కేసీఆర్ వ్య‌వ‌హారంతో తెలుగు తమ్ములు కేసీఆర్ ఆహ్వానించ‌క‌పోతేనే మంచిద‌న్న భావ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. 


ఇది ఇలా ఉంటే ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని శంకుస్థాప‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధించిన కార్య‌క్ర‌మం కాబ్బ‌టి.. ఇతర రాష్ట్రాల  ప‌్ర‌భుత్వాల‌ని ఆహ్వానిస్తున్న నేప‌థ్యంలో ప‌క్క రాష్ట్ర‌మైన తెలంగాణ సీఎంకు ఆహ్వానం ఇస్తేనే బాగుంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఒక‌రైన ఏపీ సీఎం ఏ విధ‌మైన నిర్ణ‌యం తీసుకుంటారో దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆహ్వానం అందితే వెళ్తారా లేదా అన్నదాని పై ఓ క్లారిటి రావాల్సిఉంది. ఈ వ్య‌వ‌హారం పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏలాంటి నిర్ణ‌యం తీసుకొనున్నారో వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: