దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటన 'నిర్భయ' కేసుకు ఎన్నో సంచలనాలకు నాంధి పలికింది.  2012 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన జరిగిన ఈ గ్యాంగ్ రేప్ పార్లమెంట్‌నే ...దేశాన్ని సైతం కుదిపేసింది. మహిళలంతా ఒక్కసారిగా నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు. 23 యేళ్ల ఫిజియోథెరపిస్ట్‌పై కదులుతున్న బస్సులో కొందరు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెల్సిందే.

ఈ సంఘటన దేశ ప్రజలను కలిచివేసింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం పై తీవ్రంగా స్పందించింది..నేరస్తులకు ఉరిశిక్ష విధించింది. అప్పటి నుంచి అత్యాచారం నిందితులపై ‘నిర్భయ’ చట్టం అమల్లోకి తెచ్చింది. అయినా భారత దేశంలో అత్యాచారాల పర్వం అగడం లేదు.. తాజాగా బెంగుళూరులో మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తున్న యువతి విధులు పూర్తి చేసుకొని  ఇంటికి వేళ్తు బస్సు ఎక్కిన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక ఆత్యాచరానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగొలోకి వచ్చింది.
 
కాల్ సెంటర్ లో పనిచేసున్న యువతి ఇంటికి వెళ్తామని రాత్రి 10 గంటల సమయంలో హోసూర్ ప్రధానమార్గంపై బస్సు కోసం వేచిఉంది. అటుగా వచ్చిన మినీ బస్సు ఆమార్గంవైపే వెళ్తుందంటూ చెప్పి యువతిని ఎక్కించుకుంది. యువతి బండి ఎక్కి సీట్లో కూర్చున్న వెంటనే ఓ యువకుడు కత్తితో వచ్చి యువతిని బెదిరించాడు. బండి నడుపుతున్న మరో వ్యక్తి వాహనం మార్గం మార్చి డామ్లర్ ప్రాంతంవైపు పోనిచ్చి ఎవరూలేని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఇక ఆ యువతి ని కత్తితో బెదిరిస్తూ.. పైశాచికంగా అత్యాచారం చేశారు. తర్వాత మదివాలా ప్రాంతంలో వదిలివెళ్లారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: