తెలంగాణ టి. టీడీపీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..రైతు అత్మహత్యలను నివారించాలని కోరుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్‌లో బీజేపీ-టీడీపీ నేతలు బుధవారం పాదయాత్ర నిర్వహించారు.  వరంగల్‌ కలెక్టరేట్‌ వద్ద టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసులకు వాహనాలు ఇచ్చి ఈ ప్రభుత్వం తమను కొట్టిస్తోందని, టీఆర్ఎస్ నేతలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు..తెలంగాణ ద్రోహులకు కేసీఆర్‌ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారని వారు ఏనాడైనా తెలంగాణ కోసం రోడ్డు పైకి వచ్చారా అని నిలదీశారు.


ఉద్యమకారులపై రాళ్లు వేసిన కొండా సురేఖ సీఎం కేసీఆర్‌కు ఆప్తులయ్యారని.. తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి పోరాటం చేసి కొదండ రామ్ ని పక్కన బెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: