తెలుగు నాట బాహుబళి సినిమా ఎంత పాపులర్ అయ్యిందో.. వేరే చెప్పనక్కర్లేదు.. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈ సినిమాకు లభించినంత ప్రచారం భారతదేశంలోనే వేరే ఏ చిత్రానికీ లభించలేదంటే ఆశ్చర్యం లేదేమో.. బాహుబళి ఘన విజయానికి సోషల్ మీడియా కూడా ఓ ప్రధాన కారణమని చెప్పక తప్పదు.. 

బాహుబలి, భల్లాలదేవ, రుద్రసేన, కట్టప్ప, శివగామి, కాలకేయ.. ఈ పాత్రలు ఇప్పుడు తెలుగువారి నోట అలవోకగా పలుకుతున్నాయి. వీరందిరిలో బాహుబలి కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందిన కేరక్టర్ కట్టప్ప. బాహుబళి మొదటి భాగం చివరిలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడవటం అనే సీన్ తో మాంచి సస్పెన్స్ లో సినిమా ఆగిపోవడంతో ఆ క్యారెక్టర్ పై అనేక సెటైర్లు వాడుకలోకి వచ్చేశాయి. 

అలాంటి బాహుబలి పాత్రలను ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా బాగానే వాడుకుంటున్నారు. ప్రత్యేకించి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వైసీపీ నాయకురాలు రోజా.. జగన్ దీక్షాస్థలి వద్ద మాట్లాడుతూ ఏపీ రాజకీయాలను, బాహుబలి పాత్రలను పోల్చిన తీరు ఆసక్తికరంగా ఉంది. బాహుబలి సినిమాలోని క్యారెక్టర్లతో ఆమె తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును పోల్చింది. 

రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ప చంద్రబాబు అని రోజా ఘాటుగా కామెంట్ చేసింది. చంద్రబాబు కాలకేయుడిలా ప్రజలపై దాడి చేస్తున్నాడని విమర్శించింది. అంతే కాదు.. భల్లాల దేవుడిలా చంద్రబాబు పాలిస్తున్నాడని కూడా కామెంట్ చేసింది. అంటే కట్టప్ప, బల్లాల దేవుడు, కాలికేయ ఈ మూడు కారెక్టర్లలోని నెగిటివ్ షేడ్స్ అన్నీ చంద్రబాబులో ఉన్నాయని చెప్పకనే చెప్పింది. జగన్ మాత్రం ప్రజలను కాపాడే బాహుబలి అని తేల్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: