అసెంబ్లీలో పాలక పక్షం, విపక్షం గొడవ పడటం సహజమే... ఇక ఒకరి మీద ఒకరు తిట్ల దండకాలు మొదలు పెట్టుకోవడం..మాటా మాట పెరిగి వక్యగత విషయాలు కూడా బయటకు లాగడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు శృతి మించి చేయి చేసుకోవడాలు కూడా జరుగుతుంటాయి.  తాజాగా జమ్ము కశ్మీర్లో బీఫ్పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. 


బీఫ్ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను ఖాతరు చేయబోనని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై దుమారం చెలరేగింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్, రాజీవ్ శర్మలు..  రషీద్పై దాడి చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల సమక్షంలోనే దాడి చేశారు. అసెంబ్లీ లోనే శాసన సభ్యుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు.


బీఫ్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్


ఈ సందర్బంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన శాసన సభ్యులు రషీద్ ను కాపాడారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. అసెంబ్లీలో ఓ ఎంఎల్ఏపై సాటి సభ్యులు దాడి చెయ్యడం దురదృష్టకరం అన్నారు. అయితే బీజేపీ శాసన సభ్యులు మాత్రం రషీద్ పై దాడిని సమర్థించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: